Full Site Search  
Mon May 29, 2017 00:09:50 IST
PostPostPost Stn TipPost Stn TipUpload Stn PicUpload Stn PicAdvanced Search
Large Station Board;
Large Station Board;
Large Station Board;

YA/Yerraguntla Junction (2 PFs)
యఱ్ఱగుంట్ల జంక్షన్     यर्रगुंटला जंक्शन

Track: Double Electric-Line

Type of Station: Junction
Number of Platforms: 2
Number of Halting Trains: 53
Number of Originating Trains: 0
Number of Terminating Trains: 0
Jn Pt. RU/NDL/GTL Yerraguntla Rd, Kadapa / Cuddapah (YSR District)
State: Andhra Pradesh
Elevation: 170 m above sea level
Zone: SCR/South Central
Division: Guntakal
No Recent News for YA/Yerraguntla Junction
Nearby Stations in the News

Rating: 3.0/5 (15 votes)
cleanliness - excellent (2)
porters/escalators - poor (2)
food - average (2)
transportation - good (2)
lodging - poor (2)
railfanning - excellent (1)
sightseeing - average (2)
safety - good (2)

Nearby Stations

KMH/Kalamalla 7 km     YGD/Yerragudipad 9 km     PRDT/Proddatur 14 km     KKM/Kamalapuram 16 km     MOO/Muddanuru 16 km     GPY/Gangayapalle 23 km     CIN/Chintakunta 24 km     MUM/Mangapatnam 32 km     JMDG/Jammalamadugu 32 km     KPU/Krishnapuram 32 km    

Station News

Page#    Showing 1 to 13 of 13 News Items  
Feb 13 2017 (19:15)  Additional Stoppages and diversion of 17215 BZA-DMM Express (www.facebook.com)
back to top
Other NewsSCR/South Central  -  

News Entry# 293798     
   Tags   Past Edits
Feb 13 2017 (19:15)
Station Tag: Yerraguntla Junction/YA added by Special Status Zone/1462903

Feb 13 2017 (19:15)
Station Tag: Vijayawada Junction/BZA added by Special Status Zone/1462903

Feb 13 2017 (19:15)
Station Tag: Nandyal Junction/NDL added by Special Status Zone/1462903

Feb 13 2017 (19:15)
Train Tag: Dharmavaram - Vijayawada Express/17216 added by Special Status Zone/1462903

Feb 13 2017 (19:15)
Train Tag: Vijayawada - Dharmavaram Express/17215 added by Special Status Zone/1462903

Posted by: Special Status Zone~  17 news posts
PR. No. 814 Dt. 13th Feb, 2017
Additional Stoppages for Vijayawada-Dharmavaram-Vijayawada
tri-weekly Express
Railway Board has approved for diversion and Provision of Additional Stoppages to Train No. 17215/17216 Vijayawada-Dharmavaram-Vijayawada tri-weekly Express via Nandyala, Yerraguntla, Tadipatri and Gooty. The Train is provided additional stoppages at Banaganapalli, Jemmalamadugu, Prodduturu, Yerragutla and Tadipatri stations as per detailed below:-
Accordingly,
...
more...
Train No. 17216 Dharmavaram - Vijayawada Tri-weekly Express will depart Dharmavaram at 16:00 hrs instead of 17:50 hrs with effect from 16th May, 2017 and arrive/depart Anatapur at 16:30/16:32 hrs, Gooty at 17:40/17:50 hrs, Tadipatri at 18:40/18:42 hrs, Yerragutla at 20:00/20:10 hrs, Prodduturu at 20:30/20:31 hrs, Jemmalamadugu at 20:55/20:56 hrs, Banaganapalli at 22:05/22:06 hrs, and Nandyala at 00:05/00:10 hrs on the next day and arrive Vijayawada at 06:50 hrs.
In the opposite direction, Train No. 17215 Vijayawada-Dharmavaram Tri-weekly Express will depart Vijayawada at 23:10 hrs with effect from 17th May, 2017 and arrive/depart Nandyala at 05:25/05:30 hrs, Banaganapalli at 06:00/06:01 hrs, Jemmalamadugu at 07:00/07:01 hrs, Prodduturu at 07:30/07:31 hrs, Yerragutla at 07:55/08:05 hrs, Tadipatri at 09:15/09:17 hrs, Gooty at 10:20/10:30 hrs, Anatapur at 11:53/11:55 hrs on the next day and arrive Dharmavaram at 13:00 hrs.
Aug 24 2016 (17:36)  కలల బండి వచ్చేసింది..! పరుగులు తీసిన నంద్యాల - కడప రైలు స్వాగతం పలికిన ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రయాణికుల ఉత్సాహం (www.eenadu.net)
back to top
New/Special TrainsSCR/South Central  -  

News Entry# 278063     
   Tags   Past Edits
Aug 24 2016 (5:36PM)
Station Tag: Yerraguntla Junction/YA added by සුදර්ශන්*^~/624989

Aug 24 2016 (5:36PM)
Station Tag: Nandyal Junction/NDL added by සුදර්ශන්*^~/624989

Aug 24 2016 (5:36PM)
Station Tag: Kadapa/HX added by සුදර්ශන්*^~/624989

Aug 24 2016 (5:36PM)
Station Tag: Jammalamadugu/JMDG added by සුදර්ශන්*^~/624989

Aug 24 2016 (5:36PM)
Station Tag: Proddatur/PRDT added by සුදර්ශන්*^~/624989

Aug 24 2016 (5:36PM)
Train Tag: Nandyal - Kadapa Demu/77401 added by සුදර්ශන්*^~/624989

Aug 24 2016 (5:36PM)
Train Tag: Nandyal - Kadapa Inagural Demu Special/07401 added by සුදර්ශන්*^~/624989

Posted by: Sahasra Bahubali 2*^~  389 news posts
ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, న్యూస్‌టుడే: జమ్మలమడుగు, ప్రొద్దుటూరు ప్రజల మూడు దశాబ్దాల కల ఎట్టకేలకు మంగళవారం నెరవేరింది. కేంద్ర రైల్వే శాఖామంత్రి సురేష్‌ప్రభు విజయవాడలో నంద్యాల-ఎర్రగుంట్ల రైల్వే మార్గాన్ని ప్రారంభించారు. దీంతో తొలిసారిగా నంద్యాల నుంచి కడప వరకు ప్రయాణికుల సౌకర్యార్థం డెమో రైలు నడిపారు. జమ్మలమడుగు మీదుగా ప్రొద్దుటూరు రైల్వేస్టేషన్‌కు రాత్రి 7.10 గంటల సమయానికి రైలు చేరింది. రైలు కూత వినపడడంతో ఈ ప్రాంత పట్టణ, గ్రామీణ ప్రజలు పెద్దఎత్తున కేకలు వేస్తూ పరుగుపరుగునా వచ్చారు. పౌరసరఫరాల ఛైర్మన్‌ లింగారెడ్డి నంద్యాల నుంచి రైలులోనే ప్రొద్దుటూరు వచ్చారు. ఆయనతో పాటు పలువురు నాయకులు ఆయన వెంట వచ్చారు. ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, ఇతర వైకాపా నాయకులు, కార్యకర్తలు స్టేషన్‌కు చేరుకున్నారు. తన హయాంలో రైలు ప్రొద్దుటూరుకి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. తన పేరు భవిష్యత్తులో చిరస్థాయిగా నిలిచిపోతుందని ఎమ్మెల్యే రాచమల్లు ఆనందం వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరు నుంచి నూతన రాజధాని అమరావతికి వెళ్లడానికి నేరుగా రైళ్లను ఏర్పాటుచేయాలని ఆయన కోరారు. సాయంత్రం 4.30 గంటల నుంచే తెదేపా నియోజకవర్గబాధ్యుడు నంద్యాల వరదరాజులరెడ్డి, ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, పురపాలిక ఛైర్మన్‌ ఉండేల గురివిరెడ్డి, పట్టణ తెదెపా అధ్యక్షుడు గంటసాల వెంకటేశ్వర్లు, భాజపా జిల్లా అధ్యక్షుడు శ్రీనాథరెడ్డి, ఇతర నాయకులు స్టేషన్‌కు చేరుకున్నారు. ఎమ్మార్పీఎస్‌ నాయకుడు దండు వీరయ్య మాదిగ నంద్యాల నుంచి రైలులో ప్రొద్దుటూరుకి వచ్చారు. ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి జెండా వూపి...
more...
రైలును ఎర్రగుంట్లకు పంపించారు. యువకులు, పిల్లలు సైతం రైలు ఎక్కి సెల్ఫీలు తీసుకోవడానికి ఎగబడ్డారు. గ్రామీణ సి.ఐ. ఓబులేసు, ఎస్సైలు ఆంజనేయులు, మహేశ్‌, పోలీసులు స్టేషన్‌లో బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కౌన్సిలర్లు, ఆయా పార్టీలకు చెందిన కార్యకర్తలు, పెద్దఎత్తున పాల్గొన్నారు.
గండికోట ఎక్స్‌ప్రెస్‌గా పేరు పెట్టాలి
జమ్మలమడుగు: ఎర్రగుంట్ల-నంద్యాల మార్గంలో నడిచే రైలుకు గండికోట ఎక్స్‌ప్రెస్‌గా పేరు పెట్టాలని ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నంద్యాలలో నిర్వహించిన ప్రారంభం కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, పాల్గొన్నారు. ఎస్‌.ఉప్పలపాడు వద్ద మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి, టీబీహెచ్‌ఎల్‌సీ ఛైర్మన్‌ శ్రీనివాసులరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ జంబాపురం రమణారెడ్డి, కడప రిమ్స్‌ ఛైర్మన్‌ మురళీధర్‌రెడ్డి, తెదేపా జిల్లా ఉపాధ్యక్షురాలు లక్ష్మీదేవమ్మ, మాజీ ఎంపీపీ గిరిధర్‌రెడ్డి రైలెక్కారు. జమ్మలమడుగులో పీఠాధిపతి గౌస్‌పీరాఖాద్రి, ఛైర్‌పర్సన్‌ తులసమ్మ, మాజీ మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, రోటరీ క్లబ్‌ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, కార్యదర్శి సూర్యనారాయణ, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు శివనాథరెడ్డి, ఎమ్మెల్యే కుమారుడు సుధీర్‌రెడ్డి, అధిక సంఖ్యలో ప్రజలు ప్రయాణించారు. రైలు రాకతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.
Aug 24 2016 (17:34)  నూతన రైలు మార్గంతో సీమ అభివృద్ధి నంద్యాలలో నూతన రైలు ప్రారంభం విజయవాడ నుంచి నంద్యాల-ఎర్రగుంట్ల రైలుమార్గం ప్రారంభం (www.eenadu.net)
back to top
New/Special TrainsSCR/South Central  -  

News Entry# 278061     
   Tags   Past Edits
Aug 24 2016 (5:34PM)
Station Tag: Jammalamadugu/JMDG added by සුදර්ශන්*^~/624989

Aug 24 2016 (5:34PM)
Station Tag: Proddatur/PRDT added by සුදර්ශන්*^~/624989

Aug 24 2016 (5:34PM)
Station Tag: Yerraguntla Junction/YA added by සුදර්ශන්*^~/624989

Aug 24 2016 (5:34PM)
Station Tag: Kadapa/HX added by සුදර්ශන්*^~/624989

Aug 24 2016 (5:34PM)
Station Tag: Nandyal Junction/NDL added by සුදර්ශන්*^~/624989

Aug 24 2016 (5:34PM)
Train Tag: Nandyal - Kadapa Inagural Demu Special/07401 added by සුදර්ශන්*^~/624989

Aug 24 2016 (5:34PM)
Train Tag: Kadapa - Nandyal DEMU/77402 added by සුදර්ශන්*^~/624989

Aug 24 2016 (5:34PM)
Train Tag: Nandyal - Kadapa Demu/77401 added by සුදර්ශන්*^~/624989

Posted by: Sahasra Bahubali 2*^~  389 news posts
నంద్యాల, న్యూస్‌టుడే: దశాబ్దాల కృషి అనంతరం రూపుదిద్దుకున్న నంద్యాల-ఎర్రగుంట్ల రైలు మార్గం ప్రారంభంతో రాయలసీమలో పలు రంగాల అభివృద్ధికి మార్గమేర్పడిందని నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నంద్యాల రైల్వేస్టేషన్‌లో గుంటూరు రైల్వే డివిజన్‌ మేనేజర్‌ విజయ్‌శర్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విజయవాడ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రులు సురేష్‌ ప్రభు, వెంకయ్యనాయుడులతో కలసి రిమోట్‌ ద్వారా నంద్యాల-ఎర్రగుంట్ల రైలు మార్గం శిలాఫలకాన్ని ప్రారంభించారు. అనంతరం నంద్యాల-కడపల మధ్య ఈ రైలు మార్గంపై తొలి ప్యాసింజర్‌ డెము రైలు 77401ని పచ్చజెండా వూపి నంద్యాల రైల్వేస్టేషన్‌లో ఎమ్మెల్యే భూమా, ఎంపీ ఎస్పీవైరెడ్డి, బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ అధ్యక్షుడు లింగారెడ్డి, దక్షిణ మధ్య రైల్వే కన్‌స్ట్రక్షన్‌ చీఫ్‌ ఇంజినీర్‌ డీకే సింగ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా భూమా నాగిరెడ్డి మాట్లాడుతూ.. సుదూర దృష్టితో 40 ఏళ్ల క్రితమే పెండేకంటి వెంకటసుబ్బయ్య ఈ రైలు మార్గం ఏర్పాటుకు కృషి చేశారన్నారు. ఆయన వల్లనే నేడు కర్నూలు, కడప జిల్లాలను కలుపుతూ ఈ రైలు మార్గం ఏర్పాటైందన్నారు. ఈ మార్గం నిర్మాణం కోసం గతంలో ఎంపీగా నేను, ప్రస్తుత ఎంపీగా ఎస్పీవై రెడ్డి నిధుల కోసం కృషి చేశామన్నారు. ఈ రైలు మార్గం వల్ల రాయలసీమ ప్రాంతానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని, పరిశ్రమలకు అవసరమైన రవాణా వ్యవస్థ మెరుగుపడి మరిన్ని...
more...
పరిశ్రమలు తద్వారా ఉద్యోగాలు ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి వస్తాయన్నారు. పెండేకంటి పేరుతో రైలు మార్గం, రైలు ఏర్పాటుకు రైల్వే అధికారులు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని కోరారు. బొగ్గులైనులో, నూనెపల్లెలో రైల్వే స్థలాల్లో ఇళ్లు వేసుకున్న పేదలకు మరో ఏడాది గడువిస్తే వారికి నూతన గృహాల నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎంపీ ఎస్పీవై రెడ్డి మాట్లాడుతూ.. నాటి ఎంపీ పెండేకంటి వెంకటసుబ్బయ్య చూపిన చొరవను ప్రశంసించారు. ఈ రైలును తిరుపతి వరకు పొడిగించాలని ఎంపీ కోరారు. బనగానపల్లె ఎమ్మెల్యే జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ.. సంజామల రైల్వేస్టేషన్‌కు పెండేకంటి వెంకటసుబ్బయ్య పేరును ఏర్పాటు చేయాలని కోరారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ.. పాణ్యంలో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నిలపాలని, పాణ్యంలో రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించాలని కోరారు. ఎమ్మెల్సీ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. జమ్మలమడుగు-ప్రొద్దుటూరు మధ్య అదనంగా ఒక స్టేజిని ఏర్పాటు చేయాలని, నూతన రైలుకు గండికోట ఎక్స్‌ప్రెస్‌గా నామకరణం చేయాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ అధ్యక్షుడు లింగారెడ్డి, దివంగత మాజీ కేంద్ర మంత్రి పెండేకంటి వెంకటసుబ్బయ్య సోదరుని కుమారుడు పెండేకంటి కిరణ్‌కుమార్‌లు మాట్లాడారు. అనంతరం నూతన రైలులో ఎంపీ ఎస్పీవై రెడ్డి నొస్సం వరకు, బనగానపల్లె ఎమ్మెల్యే జనార్దన్‌రెడ్డి సంజామల వరకు, పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి మద్దూరు వరకు ప్రయాణించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, గుంటూరు, గుంతకల్లు రైల్వే డివిజన్‌ అధికారులు, నంద్యాల రైల్వేస్టేషన్‌ మేనేజర్‌ జి.లక్ష్మయ్య పాల్గొన్నారు.
Aug 24 2016 (17:28)  నంద్యాల-కడప రైలు ప్రారంభం (www.sakshi.com)
back to top
New/Special TrainsSCR/South Central  -  

News Entry# 278059     
   Tags   Past Edits
Aug 24 2016 (5:28PM)
Station Tag: Jammalamadugu/JMDG added by සුදර්ශන්*^~/624989

Aug 24 2016 (5:28PM)
Station Tag: Proddatur/PRDT added by සුදර්ශන්*^~/624989

Aug 24 2016 (5:28PM)
Station Tag: Yerraguntla Junction/YA added by සුදර්ශන්*^~/624989

Aug 24 2016 (5:28PM)
Station Tag: Kadapa/HX added by සුදර්ශන්*^~/624989

Aug 24 2016 (5:28PM)
Station Tag: Nandyal Junction/NDL added by සුදර්ශන්*^~/624989

Aug 24 2016 (5:28PM)
Train Tag: Kadapa - Nandyal DEMU/77404 added by සුදර්ශන්*^~/624989

Aug 24 2016 (5:28PM)
Train Tag: Nandyal - Kadapa DEMU/77403 added by සුදර්ශන්*^~/624989

Aug 24 2016 (5:28PM)
Train Tag: Kadapa - Nandyal DEMU/77402 added by සුදර්ශන්*^~/624989

Aug 24 2016 (5:28PM)
Train Tag: Nandyal - Kadapa Demu/77401 added by සුදර්ශන්*^~/624989

Aug 24 2016 (5:28PM)
Train Tag: Nandyal - Kadapa Inagural Demu Special/07401 added by සුදර්ශන්*^~/624989

Posted by: Sahasra Bahubali 2*^~  389 news posts
నగరంపాలెం: నంద్యాల-కడప డీఈఎంయు రైలును రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు మంగళవారం విజయవాడ నుంచి రిమోట్ వీడియో లింక్ ద్వారా ప్రారంభిస్తారని గుంటూరు రైల్వే సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజరు కె.ఉమామహేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రైలును ఆదివారం మినహా వారానికి ఆరు రోజులు నంద్యాల నుంచి రెండు, కడప నుంచి రెండు సర్వీసులు నడపనున్నట్లు తెలిపారు. రైలు నంబరు 77401 నంద్యాల నుంచి ఉదయం 06.00 గంటలకు బయలుదేరి కడపకు 09.45 గంటలకు చేరుకుంటుంది.
తిరుగుప్రయాణంలో 77402 కడప నుంచి ఉదయం 10.05 గంటలకు బయలుదేరి నంద్యాలకు మధ్యాహ్నం 13.50 గంటలకు చేరుకుంటుంది. అలాగే రైలు నంబరు 77403 నంద్యాల నుంచి 14.20కి బయలుదేరి కడపకు 18.05 గంటలకు చేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో 77404 కడప 18.30కి బయలుదేరి 22.15 గంటలకు నంద్యాల చేరుకుంటుంది.
Aug 24 2016 (17:26)  చుక్‌..చుక్‌ బండి.. వచ్చిందండి! (www.sakshi.com)
back to top
New/Special TrainsSCR/South Central  -  

News Entry# 278058     
   Tags   Past Edits
Aug 24 2016 (5:26PM)
Station Tag: Yerraguntla Junction/YA added by සුදර්ශන්*^~/624989

Aug 24 2016 (5:26PM)
Station Tag: Kadapa/HX added by සුදර්ශන්*^~/624989

Aug 24 2016 (5:26PM)
Station Tag: Nandyal Junction/NDL added by සුදර්ශන්*^~/624989

Aug 24 2016 (5:26PM)
Train Tag: Nandyal - Kadapa Demu/77401 added by සුදර්ශන්*^~/624989

Aug 24 2016 (5:26PM)
Train Tag: Nandyal - Kadapa Inagural Demu Special/07401 added by සුදර්ශන්*^~/624989

Posted by: Sahasra Bahubali 2*^~  389 news posts
– నంద్యాల–ఎర్రగుంట్ల రైల్వే లైన్‌ ప్రారంభం
– నంద్యాల – కడప ప్యాసింజర్‌ రైలు పరుగులు
– నాలుగు దశాబ్దాల కల సాకారం
– రైలుకు పెండేకంటి పేరు పెట్టాలని కేంద్రానికి విజ్ఞప్తి

నంద్యాల:
...
more...
నాలుగు దశాబ్దాల కల సాకారమైంది. కలల బండి పట్టాలెక్కింది. కూ.. చుక్‌..చుక్‌ మంటూ నంద్యాల – కడప ప్యాసింజర్‌ రైలు పరుగులు పరుగులెత్తింది. ఎంతో కాలంగా ఎదురు చూసిన ప్రజలు ఆనందంగా స్వాగతం పలికారు. కేంద్ర రైల్వే మంత్రి సురేష్‌ ప్రభాకర్‌ ప్రభు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నంద్యాల–ఎర్రగుంట్ల రైల్వే లైన్‌ను మంగళవారం విజయవాడ నుంచి వీడియో రిమోట్‌ లింక్‌ద్వారా ప్రారంభించారు.

వెంటనే ఎంపీ ఎస్పీవైరెడ్డి, ఎమ్మెల్యేలు, రైల్వే అధికారులు జెండా ఊపడంతో డెమో రైలు కడపకు పరుగులు తీసింది. ఈ సందర్భంగా నంద్యాల రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నంద్యాల నుంచి తిరుపతికి రైలును ఏర్పాటు చేయాలని ఎంపీ ఎస్పీవైరెడ్డి కోరారు. తిరుపతికి వెల్లాలంటే రూ.350కి పైగా బస్‌ చార్జీలను చెల్లించాలని, కాని తక్కువ ధరకు భక్తులు తిరుపతికి వెళ్లి రావచ్చని చెప్పారు. ఈ రైల్వే లైన్‌కు శ్రీకారం చుట్టిన పెండేకంటి వెంకటసుబ్బయ్యకు ఆయన నివాళులు అర్పించారు. నంద్యాల–కడప రైలు పెండేకంటి ప్యాసింజర్‌ రైలుగా నామకరణం చేయాలని ప్రజా ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.

– నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి మాట్లాడుతూ రైల్వే లైన్‌ పూర్తి కావడంతో రవాణా సౌకర్యాలు మెరుగు పడి, అభివద్ధి జరుగుతుందన్నారు. రైల్వే స్టేషన్‌ పరిసరాల్లో ఉన్న స్థలాల్లో నివాసం ఉన్న పేదలకు ఏడాదిలోగా ప్రత్యామ్నాయం చూపిస్తామని రైల్వే అధికారులు వారిని తొలగించవద్దని కోరారు.

– ఎమ్మెల్సీ నారాయణరెడ్డి మాట్లాడుతూ జమ్మలమడుగు, ప్రొద్దుటూరు మధ్య రైల్వే స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని కోరారు.

– పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి మాట్లాడుతూ పాణ్యంలో రైల్వే రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించాలన్నారు. పాణ్యం రైల్వే బ్రిడ్జి పనులు నత్తనడకన సాగుతుండటంతో చుట్టుపక్కల వ్యాపారులు షాపులను మూసుకొని ఉపయోగించకున్నా షాప్‌రూంలకు అద్దెలు చెల్లిస్తూ నష్టపోతున్నారని చెప్పారు. జిందాల్‌ ఫ్యాక్టరీ రైల్వే స్టేషన్‌లో లోడింగ్, అన్‌లోడింగ్‌ చేస్తుండటంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని, దూరంగా తరలించాలని కోరారు.

– బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ సంజామల రైల్వే స్టేషన్‌కు పెండేకంటి పేరు పెట్టాలని కోరారు.

– నూనెపల్లె దళిత వాడ వద్ద ఉన్న రైల్వే స్థలాల్లో నివాసం ఉన్న పేదలపై దయచూపాలని కౌన్సిలర్‌ అనిల్‌ అమతరాజ్‌ రైల్వే అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు.

– కార్యక్రమంలో రైల్వే డీఆర్‌ఎం విజయ్‌శర్మ, పలువురు రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Aug 24 2016 (17:24)  నంద్యాల - ఎర్రగుంట్ల రైల్వే లైన్ ప్రారంభించిన ప్రభు (www.sakshi.com)
back to top
New/Special TrainsSCR/South Central  -  

News Entry# 278057     
   Tags   Past Edits
Aug 24 2016 (5:24PM)
Station Tag: Jammalamadugu/JMDG added by සුදර්ශන්*^~/624989

Aug 24 2016 (5:24PM)
Station Tag: Proddatur/PRDT added by සුදර්ශන්*^~/624989

Aug 24 2016 (5:24PM)
Station Tag: Yerraguntla Junction/YA added by සුදර්ශන්*^~/624989

Aug 24 2016 (5:24PM)
Station Tag: Kadapa/HX added by සුදර්ශන්*^~/624989

Aug 24 2016 (5:24PM)
Station Tag: Vijayawada Junction/BZA added by සුදර්ශන්*^~/624989

Aug 24 2016 (5:24PM)
Station Tag: Nandyal Junction/NDL added by සුදර්ශන්*^~/624989

Aug 24 2016 (5:24PM)
Train Tag: Nandyal - Kadapa Inagural Demu Special/07401 added by සුදර්ශන්*^~/624989

Aug 24 2016 (5:24PM)
Train Tag: Nandyal - Kadapa Demu/77401 added by සුදර්ශන්*^~/624989

Posted by: Sahasra Bahubali 2*^~  389 news posts
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరిస్తామని కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు స్పష్టం చేశారు. రైలుమార్గం ద్వారా నవ్యాంధ్ర రాజధాని అమరావతికి రాయలసీమను కలుపుతున్నామన్నారు. మంగళవారం డీఆర్ఎమ్ కార్యాలయంలో కేంద్రమంత్రి సురేష్ ప్రభు... నంద్యాల - ఎర్రగుంట్ల 123 కిలోమీటర్ల రైలుమార్గాన్ని రిమోట్ ద్వారా ప్రారంభించారు.
అలాగే నంద్యాల - కడపకు డిమో రైలును సురేష్ ప్రభు, చంద్రబాబుతోపాటు వెంకయ్యనాయుడు ప్రారంభించారు. నంద్యాల - ఎర్రగుంట్ల మార్గం ద్వారా విజయవాడకు నేరుగా రైలు మార్గం ఏర్పడింది. ఈ రైలు మార్గం నిర్మాణానికి రూ. 967 కోట్లు వ్యయం అయింది.
Aug 24 2016 (17:17)  While Sakshi & Sindhu got great ovation, this debutant DEMU also got superb ovation at every railway station enroute (www.sakshi.com)
back to top
New/Special TrainsSCR/South Central  -  

News Entry# 278056     
   Tags   Past Edits
Aug 24 2016 (5:17PM)
Station Tag: Jammalamadugu/JMDG added by සුදර්ශන්*^~/624989

Aug 24 2016 (5:17PM)
Station Tag: Nossam/NOSM added by සුදර්ශන්*^~/624989

Aug 24 2016 (5:17PM)
Station Tag: Pendurti/PDT added by සුදර්ශන්*^~/624989

Aug 24 2016 (5:17PM)
Station Tag: Yerraguntla Junction/YA added by සුදර්ශන්*^~/624989

Aug 24 2016 (5:17PM)
Train Tag: Nandyal - Kadapa Inagural Demu Special/07401 added by සුදර්ශන්*^~/624989

Posted by: Sahasra Bahubali 2*^~  389 news posts
సాక్షి, కడప: నంద్యాల నుంచి ప్రారంభమైన డెమూ రైలు కర్నూల్‌ జిల్లా నొస్సం రైల్వేస్టేషన్‌ను దాటుకోని సాయంత్రం 6.15 గంటలకు జిల్లాలోని జమ్మలమడుగు మండలంలోని ఉప్పలపాడు రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. రైలును చూసేందుకు భారీగా గ్రామస్తులు, విద్యార్థులు తరలివచ్చి స్వాగతం పలికారు. ఈ స్టేషన్‌లో మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు రైలు టిక్కెట్‌ కొని జమ్మలమడుగు వరకు రైలులో ప్రయాణించారు. నాలుగు దశాబ్దాలుగా ఉన్న కల సాకారం కావడంతో జమ్మలమడుగు ప్రజలు భారీగా రైల్వేస్టేషన్‌కు తరలివచ్చి స్వాగతం పలికారు. ఎమ్మెల్సీ దేవగుడినారాయణరెడ్డి, నేతలు ప్రజలు స్టేషన్‌కు చేరుకుని రైలుకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం డెమూ ప్రొద్దుటూరుకు కదిలింది.
ప్రొద్దుటూరులో రైలు పండగ
తొట్టతొలిమారు ప్రొద్దుటూరుకు రైలు వస్తోందని తెలుసుకున్న పట్టణవాసులతోపాటు పరిసర ప్రాంతాల ప్రజలు పెద్దఎత్తున రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. మధ్యాహ్నం నుంచే మహిళలతోపాటు జనమంతా రైల్వేస్టేషన్‌
...
more...
కిక్కిరిసింది. రాత్రి 7.07 ప్రాంతంలో రైలు ప్రొద్దుటూరు స్టేషన్‌కు చేరుకోగా 20 నిమిషాలపాటు ఇక్కడ ఆపారు. ప్రోటోకాల్‌ ప్రకారం రైల్వే అధికారులు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి చేత జెండా ఊపించి రైలును కదిలించారు. చిరకాలంగా ఎదురుచూస్తున్న స్వప్నం నెరవేరడంతో అనేక మంది ఈ సందర్భాన్ని ఉత్సవంలా నిర్వహించారు. దొరసానిపల్లె సర్పంచ్‌ తరఫున వైఎస్సార్‌సీపీ నాయకుడు యాకోబ్‌ లడ్లు పంచిపెట్టగా, టౌన్‌బ్యాంక్‌ చైర్మన్‌ యల్లాల కుమార్‌రెడ్డి కూల్‌డ్రింక్స్‌ అందించారు. టీడీపీ పట్టణాధ్యక్షుడు ఘంటసాల వెంకటేశ్వర్లుతోపాటు గులాబి పూలతో స్టేషన్‌కు వచ్చే వారికి స్వాగతం పలికారు. అలాగే కొంత మంది మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. అలాగే ఎల్‌ఐసీ వారి ఆధ్వర్యంలో డెమూ డ్రైవర్‌ను పూలమాలలతో సన్మానించారు. మొదటి ప్రయాణం టికెట్‌ అమ్మకాల ద్వారా ప్రొద్దుటూరు రైల్వేస్టేషన్‌కు రూ.3,501 ఆదాయం వచ్చింది.
కర్పూర హారతి
రాత్రి 8 గంటలకు ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్‌కు డెమో రైలు స్టేషన్‌కు చేరుకుంది. అప్పటికి వేలాదిసంఖ్యలో స్టేషన్‌కు చేరుకున్న ప్రజలు హర్షధ్వానాలతో రైలుకు స్వాగతం పలికారు. ఎర్రగుంట్ల– నంద్యాల రైలు కల నేటి తీరిందని వారు హర్షం వ్యక్తుం చేశారు. జనాలతో స్టేషన్‌ ఆవరణంతా కిక్కరిసింది. రైలు స్టేషన్‌కు రాగనే ఎస్టీయూ నాయకులు రైలుకు పూలమాల వేసిన స్వాగతం పలికి కాయకర్పంతో హరితి ఇచ్చి స్వీట్లును పంపిణీ చేశారు. రైలును చూసేందుకు ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల మండల చుట్టుపక్కల గ్రామాలనుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. అనంతరం కమలాపురం మీదుగా కడపకు చేరుకుంది. కడపకు రాత్రి 8:45కు చేరుకుంది. కడప రైల్వే స్టేషన్‌కు చేరుకోగానే స్టేషన్‌ మేనేజర్‌ నాసీరుద్దీన్, ఆర్‌పిఎఫ్‌ ఇన్స్‌పెక్టర్‌ వెంకటయ్య, రైల్వేఎస్‌ఐ శ్యాం సుందర్‌రెడ్డి సిబ్బంది అధికారికంగా స్వాగతం పలికారు. అలాగే బీజేపీ నాయకులు కూడా భారీ స్వాగతం పలికారు. తిరిగి కడప– నంద్యాల (77402) రాత్రే బయలుదేరి వెళ్లింది.
నా హయాంలో రైలు వచ్చినందుకు సంతోషంగా ఉంది
నేను ఎమ్మెల్యే గా ఉన్న సమయంలో నంద్యాల – ఎర్రగుంట్ల రైలు ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉంది. వాస్తవానికి ఎప్పుడో రైల్వే లైన్‌ ప్రారంభించాల్సి ఉండగా నాటి నుంచి నేటి వరకు పాలకుల నిర్లక్ష్యం కారణంగా జాప్యం జరిగింది. ఇప్పటికైనా ఈ కల సాకారమైనందుకు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ అవకాశం వచ్చినందుకు ఎంతో గర్విస్తున్నాను.
– ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి
Jul 17 2016 (18:13)  128 ఏళ్ల తర్వాత మళ్లీ నంద్యాల జంక్షన్‌ (cbnlivenews.com)
back to top
New/Special TrainsSCR/South Central  -  

News Entry# 273967   Blog Entry# 1932693     
   Tags   Past Edits
Jul 17 2016 (6:13PM)
Station Tag: Yerraguntla/YA added by සුදර්ශන්*^~/624989

Jul 17 2016 (6:13PM)
Station Tag: Nandyal/NDL added by සුදර්ශන්*^~/624989

Posted by: Sahasra Bahubali 2*^~  389 news posts
నంద్యాల రైల్వే స్టేషన్ ఇవాళ్టి నుంచి నంద్యాల రైల్వే జంక్షన్‌గా మారింది. 1887లో ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారాభివృద్ధి చేసుకొనేందుకు తూర్పు, పశ్చిమ తీరాలను కలుపుతూ గోవా నుండి బందర్ వరకు మీటర్‌గేజ్ రైల్వే లైన్‌ను నిర్మించి రైళ్లను నడపసాగారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన 69 సంవత్సరాలకు నంద్యాల రైల్వే స్టేషన్ జంక్షన్‌గా మారడం విశేషం. నాలుగు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఎర్రగుంట్ల – నంద్యాల రైల్వే లైన్ కల సాకారం కానుంది. తొలి ఏకాదశి పర్వదినం రోజున నంద్యాల జంక్షన్‌గా మార్పు చెందడం ఈ ప్రాంత ప్రజలకు మరింత సంతోషం చేకూర్చింది. ఇప్పటికే గుంటూరు డివిజన్‌లో అత్యిధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్న స్టేషన్లలో నంద్యాల రైల్వే స్టేషన్ రెండవ స్థానంలో ఉంది. రాజధాని అమరావతిలో నిర్మించనున్న సమయంలోనే విజయవాడ నుండి ధర్మవరానికి ట్రై వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించడం, రెండు మూడురోజుల్లోనే ఎర్రగుంట్ల రైల్వే లైన్‌ను గుంటూరు – గుంతకల్లు ప్రధాన రైల్వే లైన్‌కు అనుసంధానం చేసే పనులు పూర్తికావడంతో శుక్రవారం నంద్యాల రైల్వే కార్మికులకు, ఈ ప్రాంత ప్రజలకు శుభదినం అనవచ్చు.
గురువారం ద.మ.రైల్వే
...
more...
చీఫ్ సిగ్నల్, టెలికాం ఇంజనీరు మహబూబ్ అలి నేతృత్వంలో పట్టణ శివారులోని కుందూనది వంతెన ఆవలివైపున నిర్మించిన క్యాబిన్‌లో సిగ్నలింగ్ సిస్టమ్‌ను సరిచేసిన అనంతరం నంద్యాల రైల్వే స్టేషన్‌లో ఎర్రగుంట్ల రైల్వేలైన్ అనుసంధానానికి సంబంధించి సిగ్నల్ వ్యవస్థను మార్చి కొత్తగా టెలికాం కేబుల్ వ్యవస్థతో అనుసంధానం చేసి ప్రయోగాత్మకంగా రైలు ఇంజన్‌ను నడిపించారు. బనగానపల్లె స్టేషన్ నుండి నంద్యాల రైల్వే స్టేషన్ వరకు గూడ్సు రైలును నడిపేందుకు రైల్వే ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో నంద్యాల రైల్వే స్టేషన్‌కు కొత్త కళ వచ్చింది. 128 సంవత్సరాల క్రితం బ్రిటీష్‌వారు నిర్మించిన మీటర్‌గేజ్ రైల్వే లైన్‌ను 1995లో నంద్యాల లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించిన మాజీ ప్రధాన మంత్రి దివంగత పివి నరసింహారావు చొరవతో గుంటూరు – గుంతకల్లు మీటరుగేజ్ లైన్‌ను బ్రాడ్‌గేజ్‌గా మార్చారు. ప్రధాని నిధులతోనే అప్పట్లో నంద్యాల రైల్వే స్టేషన్ పాత భవనాన్ని పడగొట్టి మోడల్ స్టేషన్‌గా అభివృద్ధి చేసేందుకు నూతన పరిపాలనా భవనాన్ని అప్పటి రైల్వే శాఖ మంత్రి జాఫర్ షరీఫ్ చేతుల మీదుగా మాజీ ప్రధాని పివి నంద్యాల రైల్వే స్టేషన్ ప్రధాన భవనాన్ని ప్రారంభించడమేకాక బ్రాడ్‌గేజ్ కన్వర్షన్ పనులు పూర్తయిన అనంతరం రైలును జెండా ఊపి ప్రారంభించారు.
అప్పటి నుండి ఇప్పటి వరకు ఎర్రగుంట్ల నుండి నంద్యాల వరకు కొత్త లైన్ నిర్మాణానికి విడతల వారిగా నిధులు విడుదల చేస్తుండడంతో ఈ లైన్ నిర్మాణం నత్తనడకన సాగి నేటికి సాకారమైందనే చెప్పాలి. ఎర్రగుంట్ల రైల్వే లైన్ అనుసంధాన ప్రక్రియ పూర్తికాగానే ఆగస్టు నెల మొదటి వారంలో నంద్యాల నుండి ప్రొద్దుటూరు వరకు డెమో రైలును రోజుకు రెండు సార్లు నడిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి తోడు నంద్యాల రైల్వే స్టేషన్‌లో ఇప్పటికి ఉన్న మూడు ప్లాట్‌ఫారములను అభివృద్ధి చేయడంతోపాటు ఎర్రగుంట్ల రైల్వేలైన్ కోసం నాల్గవ ప్లాట్‌ఫామ్‌ను కూడా అభివృద్ధి చేసేందుకు అధికారులు చురుకుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం గుంటూరు – గుంతకల్లు మార్గంలో ప్రయాణికుల రైళ్లతోపాటు గూడ్సు రైళ్లు కలిపి రోజుకు 40 రైళ్లు ప్రయాణిస్తున్నాయి. ఎర్రగుంట్ల రైల్వే లైన్ పూర్తికావడంతో నంద్యాల జంక్షన్ నుండి తిరుపతి, చెన్నై వరకు పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు త్వరలో ప్రారంభం కానున్నట్లు రైల్వే ఉన్నతాధికారులు అంటున్నారు.

5444 views
Jul 17 2016 (19:33)
✿ఛుక్ 🚃 ఛుక్ 🚃 రైలు✿~   4010 blog posts   149 correct pred (71% accurate)
Re# 1932693-1            Tags   Past Edits
...waiting for another long pending dream to become true I.e MALM-KRNT-GNT
Jan 25 2016 (12:32)  Green signal for rail line connectivity to sanjamala for cement factory's @kolimigundla (epaper.andhrajyothy.com)
back to top
Other NewsSCR/South Central  -  

News Entry# 255024   Blog Entry# 1720689     
   Tags   Past Edits
Jan 25 2016 (12:32PM)
Station Tag: Yerraguntla/YA added by ✿ఛుక్ 🚃 ఛుక్ 🚃 రైలు✿/576746

Jan 25 2016 (12:32PM)
Station Tag: Nandyal/NDL added by ✿ఛుక్ 🚃 ఛుక్ 🚃 రైలు✿/576746

Jan 25 2016 (12:32PM)
Station Tag: Sanjamala/SJMA added by ✿ఛుక్ 🚃 ఛుక్ 🚃 రైలు✿/576746

Posted by: ✿ఛుక్ 🚃 ఛుక్ 🚃 రైలు✿~  54 news posts
New rail line connectivity between sanjamala - kolimigundla
For cement factory's. Estimation cost ₹ 292.62 crores

4618 views
Jan 25 2016 (12:35)
✿ఛుక్ 🚃 ఛుక్ 🚃 రైలు✿~   4010 blog posts   149 correct pred (71% accurate)
Re# 1720689-1            Tags   Past Edits
New rail line connectivity to kolimigundla frm sanjamala(sjma) which is in yerraguntla - nandyal section....where the three cement factory's are going to construct near kolimigundla

3992 views
Jan 25 2016 (18:20)
SCR Godavari Express~   2488 blog posts   11 correct pred (92% accurate)
Re# 1720689-2            Tags   Past Edits
I think state govt has already given land as well... Now it is RVNL who has to speed up the work on this new line and YA-Nandyal line as well...
Nov 15 2015 (20:34)  ఎర్రగుంట్ల - నంద్యాల రైలు ఆలస్యం (www.sakshi.com)
back to top
IR AffairsSCR/South Central  -  

News Entry# 247804     
   Tags   Past Edits
Nov 15 2015 (8:34PM)
Station Tag: Nandyal/NDL added by Guntakallu Division*^/624989

Nov 15 2015 (8:34PM)
Station Tag: Yerraguntla/YA added by Guntakallu Division*^/624989

Posted by: Sahasra Bahubali 2*^~  389 news posts
జమ్మలమడుగు/ఎర్రగుంట్ల : ప్రయాణికులను అదిగో ఇదిగో అని ఊరిస్తున్న ఎర్రగుంట్ల-నంద్యాల రైలు అంత త్వరగా పట్టాలెక్కేట్టు కనిపించడం లేదు. నొస్సం వరకు అన్ని రకాల పనులు పూర్తి కావడమే గాక ఈ మార్గంలోని నూతన రైల్వే స్టేషన్లలో స్టేషన్ మాస్టర్లు కూడా బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఇక రైలు తిరగడమే తరువాయి అని అందరూ ఆశించారు. కానీ ఈ మార్గంలో సాంకేతిక సమస్యలున్నాయని, వాటిని పరిష్కరించాకే గ్రీన్ సిగ్నల్ వస్తుందని ఈనెల 24న ఈ మార్గాన్ని పరిశీలించిన సెంట్రల్ రైల్వే సెక్యూరిటీ అధికారి దినేష్‌కుమార్‌సింగ్ ప్రకటించడంతో ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.
ఈ రైలు మార్గంలోని సాంకేతిక సమస్యలపై కేంద్ర ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదిక అందజే యడం, ఆ తర్వాత దీనిపై కేంద్రం పరిశీలించి తుది నిర్ణయం ప్రకటించడం లాంటి తతంగం పూర్తి కావాల్సి ఉంది. ఇదంతా పూర్తికావడానికి ఎంతకాలం పడుతుందన్నది ఎవరూ చెప్పలేకున్నారు. కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించడమే తమ పని ఆ శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. దీంతో ఈ మార్గంలో రైలు ఎప్పుడు తిరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
...
more...
రైల్వేస్టేషన్ సిబ్బందిని వెనక్కి పిలిపించిన అధికారులు
రైల్వే ట్రాక్, క్రాసింగ్ లెవల్, రైల్వే స్టేషన్ సిగ్నల్ సిస్టంను పరిశీలించడానికి కేంద్ర రైల్వే భద్రతాధికారి ఎస్సీ దినేష్‌కుమార్ సింగ్ వస్తుండటంతో ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, ఉప్పలపాడు, నొస్సం రైల్వేస్టేషన్‌లలో తాత్కలికంగా అసిస్టెంట్ రైల్వేస్టేషన్ మాస్టర్‌లతో పాటు సిబ్బందిని నియమించారు. అధికారులు రైల్వేలైన్ సిగ్నల్, స్టేషన్‌లను పరిశీలించి వెళ్లారు. ప్రస్తుతం సీఆర్‌ఎస్ అధికారులు నివేదిక కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంది. అయితే ఇది ఇంకా ఎంతకాలం పడుతుందో తెలియకపోవడంతో రైల్వే అధికారులు తాత్కాలిక సిబ్బందిని వెనక్కి పిలిపించుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలను పరిశీలిస్తే రైలు తిరగడం మరింత ఆలస్యం కావచ్చని తెలుస్తోంది. కాగా వచ్చే మార్చి నాటికి రైలు తిరిగే అవకాశం ఉందని రైల్వే అధికారులు చెప్పుకొస్తున్నారు.
కోట్లాది రూపాయల వస్తువులకు భద్రత కరువు...
కొత్త రైల్వేస్టేషన్లలో నియమితులైన సిబ్బంది వెనక్కి వెళ్లిపోవడంతో రైల్వేస్టేషన్లు మూతపడ్డాయి. కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన స్టేషన్లలోని విలువైన వస్తువుల భద్రతకు ఎవరు బాధ్యత వహిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. సీఆర్‌ఎస్ పరిశీలన అనంతరం సిబ్బంది తిరిగి వారి పాత స్టేషన్‌లకు వెళ్లిపోవడంతో స్టేషన్లలోని సామగ్రి, పరికరాల భద్రతపై అనుమానాలు తలెత్తుతున్నాయి.
ప్రజాప్రతినిధులు.. రాజకీయ పార్టీలు స్పందించాలి
ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక నెరవేరుతోందనే సమయంలో ఉన్నట్లుండి ఎర్రగుంట్ల- నంద్యాల రైలు మార్గంలో రైళ్ల రాకపోకలు ఇప్పట్లో కొనసాగే పరిస్థితి లేకపోవడంపై ప్రజలు తీవ్ర నిరాశలో ఉన్నారు. ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు స్పందించి ఈ మార్గంలో సత్వరమే రైళ్లు తిరిగేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. అవసరమైతే రైల్వే కార్యాలయాల వద్ద ఆ ప్రజా ప్రతినిధులు జోక్యం చేసుకుని ప్రజాసోమ్ము దుర్వినియోగం కాకుండ చూడాలని ప్రజలు కోరుతున్నారు. సీఆర్‌ఎస్ నుంచి అనుమతులు లభిస్తే ప్రస్తుతం అరక్కోణం నుంచి కడప వరకు నడుస్తున్న ప్యాసింజర్ రైలును నొస్సం వరకు పొడిగించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి అటు అధికారులు, ఇటు రాజకీయ పార్టీలు, ప్రజా ప్రతినిధులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.
Page#    Showing 1 to 13 of 13 News Items  

Scroll to Top
Scroll to Bottom


Go to Desktop site