ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాల మధ్య తిరుగుతున్న రాజారాణి ఎక్స్ప్రెస్ ఇకపై వారంలో 6 రోజులు తిరగనుంది. ప్రస్తుతం రైలు నెం.18118తో రూర్కెలా గుణుపూర్ రాజారాణి ఎక్స్ప్రెస్ సోమ, బుధ, శనివారాల్లో తిరుగుతోంది. తాజాగా రైల్వేబోర్డు ఆదేశాల మేరకు ఈనెల 13వ తేదీ నుంచి ఒక్క ఆదివారం మినహా సోమవారం నుంచి శనివారం వరకు ప్రతీరోజు ఈ రైలు రూర్కెలా నుంచి బెర్హంపూర్, పలాస, గుణుపూర్ లైనులో నడుస్తుంది. ప్రతీరోజు పలాస రైలు నిలయానికి ఉదయం 10.30 గంటలకు చేరుకొని గుణుపూర్ మధ్యాహ్నం 1.30 గంటలకు చేరుకుంటుంది. మధ్యాహ్నం 3.15 గంటలకు గుణుపూర్ నుంచి బయలుదేరి సాయంత్రం 6.10 గంటలకు పలాస చేరుకుంటుంది.