article source :
విశాఖపట్నం కేంద్రంగా దక్షిణకోస్తా రైల్వేజోన్ ఏర్పాటులో మంత్రిత్వశాఖ నిర్లక్ష్యధోరణితో వ్యవహరిస్తున్నట్లు లోక్సభ హామీల కమిటీ ఆక్షేపించింది.
తీసుకున్న...
more... చర్యలు సంతృప్తికరంగా లేవుపార్లమెంటు హామీల కమిటీ ఆక్షేపణనిర్దిష్ట గడువుతో కూడిన కార్యాచరణ అమలుచేయాలని ఆదేశం
ఈనాడు, దిల్లీ: విశాఖపట్నం (Visakhapatnam) కేంద్రంగా దక్షిణకోస్తా రైల్వేజోన్ (South Coast Railway zone) ఏర్పాటులో మంత్రిత్వశాఖ నిర్లక్ష్యధోరణితో వ్యవహరిస్తున్నట్లు లోక్సభ హామీల కమిటీ ఆక్షేపించింది. మంగళవారం సభకు సమర్పించిన నివేదికలో ఈ విషయంలో రైల్వేశాఖ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టింది. దక్షిణకోస్తా రైల్వేజోన్, రాయగడ డివిజన్ ఏర్పాటు గురించి 2020 మార్చి, 2021 ఫిబ్రవరి, మార్చి నెలల్లో లోక్సభలో ఆంధ్రప్రదేశ్ సభ్యులు అడిగిన ప్రశ్నకు రైల్వేమంత్రి సమాధానమిస్తూ డీపీఆర్ తయారైందని, అది రైల్వేబోర్డు పరిశీలనలో ఉందని, అందువల్ల నిర్దిష్ట గడువు చెప్పలేమని పేర్కొన్నారు. ఈ హామీ అమలుపై అధ్యయనం చేసిన కమిటీ మూడేళ్లుగా రైల్వేశాఖ వ్యవహారశైలిని తీవ్రంగా తప్పుబట్టింది. ‘‘దక్షిణకోస్తా రైల్వేజోన్, రాయగడ డివిజన్ ఏర్పాటులో తీవ్ర జాప్యం జరిగినట్లు కమిటీ గుర్తించింది. ఈ సమస్య నిరంతరం కొనసాగుతోంది. డీపీఆర్ ఇప్పటికీ ఇంకా రైల్వే మంత్రిత్వశాఖ పరిశీలనలోనే ఉంది. దాని ఖరారుకు కొంత సమయం పడుతుందన్న విషయాన్ని కమిటీ అర్థం చేసుకుంది.
ఇంత ముఖ్యమైన హామీలో మూడేళ్లకు పైగా జాప్యాన్ని కమిటీ అంగీకరించట్లేదు. అది రైల్వే మంత్రిత్వశాఖ నిర్లక్ష్యాన్ని చాటుతోంది. వాల్తేరు డివిజన్ మూసివేత గురించి ప్రజాప్రతినిధులతో పాటు, వివిధ భాగస్వామ్యపక్షాలతో చర్చించి సమస్యను పరిష్కరించి ఉండాల్సింది. దీనిపై మంత్రిత్వశాఖ సమాధానంతో కమిటీ సంతృప్తి చెందడంలేదు. రైల్వేజోన్ అంశాన్ని పార్టీలతో సంబంధం లేకుండా సభ్యులంతా సభలోనూ, బయట ప్రస్తావిస్తున్నారు. మౌలికవసతుల పనులు నిర్దిష్ట గడువులోగా పూర్తిచేయడం కష్టమని కమిటీకి తెలుసు. ఇదే సమయంలో హామీలు నెరవేర్చడానికి రైల్వేశాఖ ప్రయత్నాలు చేయలేదన్నది నిజం. ఇప్పటికైనా రైల్వేశాఖ అన్ని పక్షాలతో సమన్వయం చేసుకొని, హామీల అమలుకు నడుం బిగించాలి. రాయగడ డివిజన్ ఏర్పాటుతో ఆ జిల్లాలో పారిశ్రామిక, సామాజిక, ఆర్థికాభివృద్ధి జరుగుతుంది. అందువల్ల రైల్వేశాఖ వెంటనే దక్షిణకోస్తా రైల్వేజోన్, రాయగడ డివిజన్ ఏర్పాటుకు నిర్దిష్ట గడువుతో కూడిన కార్యాచరణను తయారుచేసి అమలుచేయాలి’’ అని కమిటీ తన నివేదికలో పేర్కొంది.
#southcoastrailwayzone #bza #gnt #gtl #aprailwayinfra #ap_railway_infra #vskprailwayzone #andhra_railway_infra #SCOR
please wait...Translate to EnglishArticle source:
Vishakhapatnam, the headquarters of the South Coast Railway zone, is facing criticism from the Lok Sabha Committee for its negligent approach in the implementation of railway plans. The committee expressed its disapproval of the actions taken and ordered the Railway Department to rectify its conduct. The issue regarding the establishment of the South Coast Railway zone, Rayagada Division, has been raised by members of the Andhra Pradesh Assembly during the Lok Sabha sessions in March 2020, February 2021, and March 2021. Railway Minister provided a solution to the concerns raised by the Members of Parliament and issued a directive to address the specified problems. However, the committee found flaws and discrepancies in the implementation of these actions. The committee accepted the importance of the issue but did not approve of the actions taken. The Railway Department needs to engage with various stakeholders, including public representatives and different interest groups, to resolve the problem. The committee remains unsatisfied with the resolution proposed by the Railway Department. The members are discussing the need to complete the necessary tasks as soon as possible. The railway zone should coordinate with all parties involved and prioritize the execution of the remedies. The Rayagada