Spotting
 Timeline
 Travel Tip
 Trip
 Race
 Social
 Greeting
 Poll
 Img
 PNR
 Pic
 Blog
 News
 Conf TL
 RF Club
 Convention
 Monitor
 Topic
 #
 Rating
 Correct
 Wrong
 Stamp
 PNR Ref
 PNR Req
 Blank PNRs
 HJ
 Vote
 Pred
 @
 FM Alert
 FM Approval
 Pvt

RailCal - Train Search + Time-Tables + Avl Calendar + Forum

नहीं कोई गम, रेलवे से हैं हम - Aman

Search Forum
Filters:
Page#    30 Blog Entries  next>>
Rail News
23016 views
0

Feb 02 (17:01)   రైల్వే జోన్ కోసం 52.22 ఎకరాలు సిద్దంగా ఉంది: విశాఖ కలెక్టర్ మల్లికార్జున

NaagendraV   32 news posts
Entry# 5959328   News Entry# 539756         Tags   Past Edits
విశాఖపట్టణంలో  రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి  క్లియర్ టైటిల్ తో  52.22 ఎకరాల భూమి సిద్దంగా ఉందని  రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 
...

Rail News
20781 views
0

Feb 02 (17:39)
NaagendraV
NaagendraV   286 blog posts
Re# 5959328-1               Past Edits
Article source :
విశాఖపట్టణంలో  రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి  క్లియర్ టైటిల్ తో  52.22 ఎకరాల భూమి సిద్దంగా ఉందని  రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 

విశాఖపట్టణం:  విశాఖపట్టణంలో  రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి  ఈ ఏడాది జనవరిలోనే  భూమిని సిద్దంగా ఉంచామని  అధికారులు ప్రకటించారు. విశాఖపట్టణంలో రైల్వే జోన్ ఏర్పాటుకు  సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయిస్తే  పనులు ప్రారంభిస్తామని  కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఆశ్విని వైష్ణవ్ ఈ నెల  1వ తేదీన ప్రకటించారు.ఈ విషయమై  విశాఖపట్టణం జిల్లా కలెక్టర్ మల్లికార్జున  స్పందించారు. 
...
more...

విశాఖపట్టణంలో రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి  అవసరమైన  52.22 ఎకరాల భూమి సిద్దం చేసినట్టుగా కలెక్టర్  తెలిపారు. ఈ విషయమై  రైల్వేశాఖకు  లేఖ రాసినా కూడ స్పందించలేదని కలెక్టర్   మాట్లాడారు. 

రైల్వే జోన్ ఏర్పాటు విషయమై భూమి కేటాయింపు విషయమై  ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. క్లియర్ టైటిల్ ఉన్న భూమిగా కలెక్టర్  పేర్కొన్నారు. ఓ తెలుగు న్యూస్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కలెక్టర్ ఈ విషయాలను పేర్కొన్నారు.

Budget 2024: 'విశాఖపట్టణంలో రైల్వేజోన్‌ ఏర్పాటుపై కేంద్రం స్పష్టత'

సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ను విశాఖపట్టణంలో ఏర్పాటు చేసేందుకు  డీపీఆర్, నిధులు కూడ సిద్దంగా ఉన్నట్టుగా కేంద్ర మంత్రి ఆశ్విని వైష్ణవ్ చెప్పారు. అయితే  రాష్ట్ర ప్రభుత్వం భూమిని తమకు కేటాయిస్తే  ఈ పనులు ప్రారంభిస్తామన్నారు. 

అయితే రైల్వేశాఖకు  నెల రోజుల క్రితమే ఈ విషయమై  లేఖ పంపినట్టుగా విశాఖపట్టణం కలెక్టర్  స్పష్టం చేశారు. ఈ విషయమై  రైల్వే శాఖ ఉన్నతాధికారులతో కూడ  ఫోన్ లో కూడ సంప్రదింపులు జరిపిన విషయాన్ని కూడ ఆయన ఆ ఇంటర్వ్యూలో గుర్తు చేశారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పలు సంస్థలు ఇస్తామని  అప్పటి యూపీఏ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ హామీల్లో భాగంగానే  విశాఖపట్టణంలో ప్రత్యేక రైల్వే జోన్ కూడ ఉంది.  అయితే  రాష్ట్ర విభజన జరిగిన పదేళ్లు జరుగుతున్న ఈ చట్టంలో పొందుపర్చిన అంశాలు ఇంకా  అమలు కాని పరిస్థితి నెలకొంది. ఈ రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం  కేంద్ర ప్రభుత్వం  అధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. రెండు రాష్ట్రాలకు చెందిన అధికారులతో ఈ కమిటీ తరచుగా సమావేశాలు నిర్వహిస్తుంది. 


#BZA #GNT #GTL #VSKP #SCOR #ANDHRARAILWAYINFRA #SOUTHCOASTRAILWAY

Translate to English
Translate to Hindi
Show AI Response

2 Public Posts - Fri Feb 02, 2024
Rail News
102065 views
0

Jan 21 (09:19)   విజయవాడ డివిజన్‌లో భారీగా రైళ్ల రద్దు

NaagendraV   32 news posts
Entry# 5948142   News Entry# 538279         Tags   Past Edits
విజయవాడ డివిజన్‌లో నిర్వహణ పనుల దృష్ట్యా పలురైళ్లను రద్దు చేయడంతో పాటు దారి మళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ...

Rail News
103490 views
0

Jan 21 (09:21)
NaagendraV
NaagendraV   286 blog posts
Re# 5948142-1              
article source :
విజయవాడ డివిజన్‌లో నిర్వహణ పనుల దృష్ట్యా పలురైళ్లను రద్దు చేయడంతో పాటు దారి మళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
విజయవాడ (రైల్వేస్టేషన్‌), న్యూస్‌టుడే: విజయవాడ డివిజన్‌లో నిర్వహణ పనుల దృష్ట్యా పలురైళ్లను రద్దు చేయడంతో పాటు దారి మళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రద్దయిన రైళ్ల వివరాలివీ..
17239/17240 గుంటూరు-విశాఖపట్నం (ఈ నెల
...
more...
29వ తేదీ నుంచి ఫిబ్రవరి 25 వరకు)
07977/07978విజయవాడ-బిట్రగుంట (ఈ నెల 29వ తేదీ నుంచి ఫిబ్రవరి 25 వరకు)
17219/17220 మచిలీపట్నం-విశాఖపట్నం (29వ తేదీ నుంచి ఫిబ్రవరి 26 వరకు)
17243/17244 గుంటూరు-రాయగడ (29వ తేదీ నుంచి ఫిబ్రవరి 26 వరకు)
పాక్షికంగా.. (విజయవాడ రామవరప్పాడు మధ్య) ఈ నెల 29వ తేదీ నుంచి ఫిబ్రవరి 25 వరకు
07896 మచిలీపట్నం-విజయవాడ, 07769 విజయవాడ-మచిలీపట్నం, 07863 విజయవాడ- నర్సాపూర్‌, 07866 విజయవాడ- మచిలీపట్నం, 07770 మచిలీపట్నం- విజయవాడ, 07283 విజయవాడ- భీమవరం జంక్షన్‌, 07870 మచిలీపట్నం- విజయవాడ, 07861 విజయవాడ-నర్సాపూర్‌.
దారి మళ్లింపు (వయా విజయవాడ, భీమవరం, నిడదవోలు)
22643 యర్నాకుళం-పాట్నా (ఈ నెల 29, ఫిబ్రవరి 5, 12, 19 తేదీల్లో)
12756 భావనగర్‌-కాకినాడపోర్ట్‌ (ఫిబ్రవరి 3, 10, 17, 24 తేదీల్లో)
12509 బెంగళూరు-గౌహతి(ఈ నెల 31, ఫిబ్రవరి 2, 7, 9, 14, 16, 21, 23 తేదీల్లో)
11019 ఛత్రపతి శివాజీ టెర్మినస్‌-భువనశ్వర్‌(ఈ నెల 29, 31 ఫిబ్రవరి 2, 3, 5, 7, 9, 10, 12, 14, 16, 17, 19, 21, 23, 24 తేదీల్లో)
13351 ధన్‌బాద్‌-అల్లపూజ(ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 25వరకు)
18111 టాటా- యశ్వంత్‌పూర్‌(ఫిబ్రవరి 1, 8, 15, 22 తేదీల్లో)
22837 హతియా-బెంగళూరు(ఫిబ్రవరి 3, 10, 17, 24 తేదీల్లో)
12835 హతియా-బెంగళూరు(ఈ నెల 30, ఫిబ్రవరి 4, 6, 11, 13, 18, 20, 25 తేదీల్లో)
12889 టాటా-బెంగళూరు(ఫిబ్రవరి 2, 9, 16, 23 తేదీల్లో)

#BZA #Southcoastrailway #SCoR #MTM #NS

Translate to English
Translate to Hindi
Show AI Response
Rail News
56498 views
1

Jan 14 (13:54)   BJP Spokesperson Blames Andhra Pradesh Government for Railway Project Cost Escalation

NaagendraV   32 news posts
Entry# 5941992   News Entry# 537492         Tags   Past Edits
In a recent media briefing at the state party office, Lanka Dinakar, BJP Chief Spokesperson for Andhra Pradesh, voiced concerns over the soaring costs of railway...

Rail News
46318 views
0

Jan 14 (13:56)
NaagendraV
NaagendraV   286 blog posts
Re# 5941992-1            Tags   Past Edits
ARTICLE SOURCE :

In a recent media briefing at the state party office, Lanka Dinakar, BJP Chief Spokesperson for Andhra Pradesh, voiced concerns over the soaring costs of railway projects in the state. Dinakar attributed the cost escalation to the state government’s lack of cooperation in land allocation and funding.

According
...
more...
to Dinakar, the Andhra Pradesh government’s delay in providing funds has resulted in a considerable 42 percent rise in the costs of railway projects. The spokesperson specifically spotlighted the Nadikudi-Srikalahasti railway line project, which has seen its costs hike up due to the state’s non-cooperation.

The project, with a length of 309 km, was initially estimated at Rs 2,289 crore. The state government was responsible for 50 percent of the land acquisition and construction costs. While the Central government has released its share, the state government is lagging, leading to a surge in the project’s cost.

Other Delayed Projects Add to the Escalating Costs

Furthermore, Dinakar pointed out the Kotipalli-Narsapur new line project that has been delayed since its sanction in 2000-01, causing the projected expenditure of Rs 2,120 crore to rise. The Central government is covering 75 percent of the cost, with the state government contributing the remaining 25 percent. The construction includes building three bridges across the Gowtami, Vainateya, and Vasishta rivers.

Adding to the list of criticisms, Dinakar chastised the state government for delaying the land transfer necessary for the construction of a new South Coast Railway zone office at Mudaravalasa, which requires 52 acres of land. The BJP spokesperson implored the state government to release its share of the funds promptly to expedite the construction of these crucial railway projects.

#BZA #GNT #GTL #VSKP #SCOR #ANDHRARAILWAYINFRA #SOUTHCOASTRAILWAY #APNRL #apNewRailwayLine

Translate to English
Translate to Hindi
Show AI Response

3 Public Posts - Sun Jan 14, 2024

2 Public Posts - Tue Jan 16, 2024

1 Public Posts - Sun Jan 21, 2024
Rail News
24236 views
0

Jan 13 (07:26)   ఏపీకి రైల్వే కేటాయింపులు రూ.8,400 కోట్లకు పెంపు

NaagendraV   32 news posts
Entry# 5940666   News Entry# 537333         Tags   Past Edits
ఆంధ్రప్రదేశ్‌కు రైల్వే కేటాయింపులు రూ.886 కోట్ల నుంచి రూ.8,400 కోట్లకు పెంచారని, వందేభారత్‌ రైళ్లు దేశవ్యాప్తంగా 41 ప్రారంభమైతే.. ఏపీలో అయిదు అందుబాటులోకి వచ్చాయని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. ...

Rail News
24851 views
1

Jan 13 (07:29)
NaagendraV
NaagendraV   286 blog posts
Re# 5940666-1              
Article source : ఆంధ్రప్రదేశ్‌కు రైల్వే కేటాయింపులు రూ.886 కోట్ల నుంచి రూ.8,400 కోట్లకు పెంచారని, వందేభారత్‌ రైళ్లు దేశవ్యాప్తంగా 41 ప్రారంభమైతే.. ఏపీలో అయిదు అందుబాటులోకి వచ్చాయని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు.

గుంటూరు (నగరంపాలెం), న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌కు రైల్వే కేటాయింపులు రూ.886 కోట్ల నుంచి రూ.8,400 కోట్లకు పెంచారని, వందేభారత్‌ రైళ్లు దేశవ్యాప్తంగా 41 ప్రారంభమైతే.. ఏపీలో అయిదు అందుబాటులోకి వచ్చాయని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. గుంటూరు రైల్వేస్టేషన్‌లో ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ పొడిగింపును కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి శుక్రవారం జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. నంద్యాల-రేణిగుంట, నర్సాపూర్‌-హుబ్బళ్లి మధ్య రైళ్లను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ మోదీ ప్రభుత్వ హయాంలో
...
more...
25,800 కిలోమీటర్ల మేర కొత్త ట్రాక్‌లు వేశారన్నారు. ఏపీలో అన్ని లైన్ల విద్యుదీకరణ పూర్తి చేశామని తెలిపారు. 371 కిలోమీటర్ల మేర కొత్త రైలు మార్గాన్ని ఏపీలో నిర్మించినట్లు వివరించారు. విశాఖ-విజయవాడ ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రయాణికుల సౌకర్యార్థం గుంటూరుకు పొడిగించినట్లు     వివరించారు. విజయవాడ-హుబ్బళ్లి రైలును కోనసీమ ప్రజలకు చేరువ చేసేందుకు నర్సాపూర్‌ వరకు     పొడిగించామన్నారు. నంద్యాల - రేణిగుంట మధ్య రాయలసీమ ప్రజలు వెంకన్నను దర్శించుకునే వీలుగా రైలును ఏర్పాటు చేశామన్నారు. గుంటూరు-విశాఖ మధ్య నడిచే రైలు వారంలో అయిదు  రోజులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందన్నారు.

సంక్రాంతిని పురస్కరించుకొని జనవరి 13 నుంచి మూడు రైళ్లు అందుబాటులో ఉంటాయన్నారు. గుంటూరు నగర మేయర్‌ మనోహర్‌నాయుడు మాట్లాడుతూ గుంటూరు జీజీహెచ్‌ ఎదురుగా ఉన్న ప్రధాన టెర్మినల్‌ను అభివృద్ధి చేయాలని కోరారు. కార్యక్రమంలో డీఆర్‌ఎం ఎం.రామకృష్ణ, మాజీ మంత్రి అరుణ, మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య, భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాశ్‌ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

#SCOR #BZA #GNT #GTL #VSKP #eXtension2024 #eXtensionSCR2024 #andhrarailwayinfra #southcoastrailway

Translate to English
Translate to Hindi
Show AI Response
Rail News
35782 views
0

Jan 12 (07:04)   ఎంప్లాయీస్‌ ట్రైన్‌కు ఏమైంది?

NaagendraV   32 news posts
Entry# 5939345   News Entry# 537218         Tags   Past Edits
రాష్ట్ర విభజన తర్వాత.. నూతన ఆంధ్రప్రదేశ్‌ రాజధానిలో పనిచేసే ఉద్యోగులు, ప్రజల కోసం నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చొరవతో నాడు సికింద్రాబాద్‌ నుంచి (ప్రస్తుతం లింగంపల్లి నుంచి నడుస్తోంది) ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రైలు అది....

Rail News
35998 views
1

Jan 12 (07:06)
NaagendraV
NaagendraV   286 blog posts
Re# 5939345-1              
1 compliments
Useful
Article source :
రాష్ట్ర విభజన తర్వాత.. నూతన ఆంధ్రప్రదేశ్‌ రాజధానిలో పనిచేసే ఉద్యోగులు, ప్రజల కోసం నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చొరవతో నాడు సికింద్రాబాద్‌ నుంచి (ప్రస్తుతం లింగంపల్లి నుంచి నడుస్తోంది) ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రైలు అది.

నాడు మేటి రైలు.. నేడు అపరిశుభ్రతకు నెలవుప్రయాణికుల అవస్థలు పట్టని రైల్వేశాఖ
...
more...



ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర విభజన తర్వాత.. నూతన ఆంధ్రప్రదేశ్‌ రాజధానిలో పనిచేసే ఉద్యోగులు, ప్రజల కోసం నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చొరవతో నాడు సికింద్రాబాద్‌ నుంచి (ప్రస్తుతం లింగంపల్లి నుంచి నడుస్తోంది) ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రైలు అది. నల్గొండ, గుంటూరు, మంగళగిరి స్టాప్‌లతో విజయవాడకు ప్రయాణించే ఈ రైలుకు.. అతి తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో గుంటూరు, విజయవాడలకు వెళ్లే రైలుగా మంచి ఆదరణ ఉంది. ఎల్‌హెచ్‌బీ బోగీలతో కూడిన ఈ రైలు గతంలో పరిశుభ్రత, నిర్వహణ పరంగానూ మేటిగా ఉండేది. అలాంటి రైలు ప్రస్తుతం నిర్వహణలో నాసిరకంగా ఉందని ప్రయాణికులు ఫిర్యాదులు చేస్తున్నారు. తిరిగి వచ్చే సమయంలో సమయ పాలనా ఉండడంలేదన్న విమర్శలు వస్తున్నాయి. ఈ రైలు నిత్యం వేకువజామున 4.40 గంటలకు లింగంపల్లిలో బయలుదేరి విజయవాడకు 10.30కు చేరుతుంది. తిరిగి విజయవాడలో సాయంత్రం 5.30కు బయలుదేరి రాత్రి 10.15 గంటలకు సికింద్రాబాద్‌, 11.20కి లింగంపల్లి చేరుతుంది. గత శుక్రవారం లింగంపల్లి నుంచి విజయవాడ వెళ్తున్న రైలులోని సి-2 బోగీలో సీటు నంబరు 26 దగ్గర చెత్త ఉందని ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయిందని ప్రయాణికులు తెలిపారు. అదే రోజు విజయవాడ నుంచి వచ్చే సమయంలో డి-5 బోగీలోకి నీళ్లు వచ్చాయని వాపోయారు. సాధారణ బోగీలతో పాటు.. ఏసీ బోగీలు కూడా అపరిశుభ్రంగా కనిపిస్తున్నాయని.. మరుగుదొడ్లకు వెళ్లలేని పరిస్థితి ఉందని అంటున్నారు.

నడుం నొప్పి తెస్తున్న సీట్లు..

ఈ రైలులోని సీట్ల నిర్వహణ కూడా సరిగా లేదని ప్రయాణికులు ఫిర్యాదు చేస్తున్నారు. వెనక్కు వాల్చినా.. ముందుకు ఒరిగిపోతుండడంతో నాలుగైదు గంటల ప్రయాణానికే నడుం నొప్పి వస్తోందని వాపోతున్నారు. దాదాపు 40 శాతం సీట్లకు ముందు.. కాళ్లు పెట్టుకునే ‘ఫుట్‌రెస్ట్‌’లు లేవని చెబుతున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని, 5 గంటల్లో గమ్యస్థానం చేరాల్సిన రైలు.. తిరుగు ప్రయాణంలో కొన్నిసార్లు ఆలస్యంగా నడుస్తోందని పేర్కొంటున్నారు.

#BZA #GNT #GTL #VSKP #SCOR #Southcoastrailway

Translate to English
Translate to Hindi
Show AI Response
Page#    30 Blog Entries  next>>

Scroll to Top
Scroll to Bottom
Go to Desktop site
Important Note: This website NEVER solicits for Money or Donations. Please beware of anyone requesting/demanding money on behalf of IRI. Thanks.
Disclaimer: This website has NO affiliation with the Government-run site of Indian Railways. This site does NOT claim 100% accuracy of fast-changing Rail Information. YOU are responsible for independently confirming the validity of information through other sources.
India Rail Info Privacy Policy