Spotting
 Timeline
 Travel Tip
 Trip
 Race
 Social
 Greeting
 Poll
 Img
 PNR
 Pic
 Blog
 News
 Conf TL
 RF Club
 Convention
 Monitor
 Topic
 #
 Rating
 Correct
 Wrong
 Stamp
 PNR Ref
 PNR Req
 Blank PNRs
 HJ
 Vote
 Pred
 @
 FM Alert
 FM Approval
 Pvt

RailCal app

site support

Forget AI; our RailFans are endowed with NI - Natural Intelligence

Search Forum
<<prev entry    next entry>>
Blog Entry# 2207157
Posted: Mar 23 2017 (02:19)

2 Responses
Last Response: Mar 23 2017 (08:15)
General Travel
1402 views
0

Mar 23 2017 (02:19)  
Krrish
Krrish   135 blog posts
Entry# 2207157              
News about Nizam abad peddapalli new line inaugural run on 25 march (namaste telangana)నమస్తేగాణ:ఆ ఆలోచన మొగ్గ తొడిగి 72 ఏండ్లు గడిచాయి.. పనులు ప్రారంభమై రెండు పుష్కరాలు దాటిపోయాయి.. సమైక్య పాలనలో నత్తకే నడక నేర్పిన పెద్దపల్లి- నిజామాబాద్ రైలు మార్గం ఎట్టకేలకు పూర్తయింది.. ఉమ్మడి జిల్లా ప్రజల దశాబ్దాల ఎదురుచూపులకు తెరదించే తరుణం రానేవచ్చింది.. ఈ నెల 25న ఇందూరు రైలు కూతపెట్టనున్నది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా కేంద్ర మంత్రి సురేశ్ ప్రభు ప్రారంభించనుండగా, ఇటీవల నిర్దేశించుకున్న లక్ష్యం కంటే 9నెలల ముందుగానే గమ్యం చేరేందుకు చుక్‌చుక్ బండి సిద్ధమవుతున్నది.
72ఏళ్ల కింది ప్రతిపాదన అది. ఇన్నెళ్లలో ఎన్నో ప్రభుత్వాలు మారిపోయాయి. ఇదిగో రైలు.. అదిగో రైలు అని పాలకులు చెప్పడం.. ప్రజలు ఎదురుచూడడం సర్వసాధారణమైంది. ఏటా రైల్వే బడ్జెట్ రోజున పెద్దపల్లి-నిజామాబాద్ మార్గానికి ఏవైనా నిధులు కేటాయిస్తారా అని ఎదురుచూడడం, తీరా పైసా పోవడంతో ఉసూరుమనడం మామూలైంది. తెలంగాణ ఉద్యమం మొదలైన తర్వాత కరీంనగర్ ఎంపీగా, కేంద్ర మంత్రిగా కేసీఆర్ బాధ్యతలు నిర్వహించిన సమయంలో ఆయన చేసిన కృషి
...
more...
ఫలితంగా పెద్దపల్లి-కరీంనగర్-జగిత్యాల దాకా రైల్వే లైన్ పూర్తయింది. జగిత్యాల, పెద్దపల్లి, కాగజ్‌నగర్ దాకా పుష్‌పుల్ రైలు నడిచింది. 2014 తర్వాత నిజామాబాద్ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న కల్వకుంట్ల కవిత కృషి ఫలితంగా మూడేళ్ల వ్యవధిలో ఊహించిన దానికంటే అధికంగా జగిత్యాల -ఇందూరు మధ్య రైల్వేలైన్ నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి.
గత డిసెంబర్‌లో జగిత్యాల-నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ దాకా రైలు ప్రారంభమైంది. ఆ సమయంలో ఎంపీ కవిత మాట్లాడుతూ 2017, డిసెంబర్ వరకు రైల్వేలైన్ పూర్తవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే పట్టుదలగా పనిచేయడంతో అనుకున్న లక్ష్యానికి 9 మాసాల ముందుగానే రైల్వేలైన్ పూర్తయింది. జగిత్యాల-ఇందూరు మధ్య రైలును ఈనెల 25న కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభు, దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కేంద్రమైన సికింద్రాబాద్ నుంచి ప్రారంభించనున్నారు.
నిజాం కాలంలో అంకురార్పణ
పెద్దపల్లి-జగిత్యాల-నిజామాబాద్ రైల్వేలైన్ ఏర్పాటు అంశం నిజాం కాలంలో ప్రారంభమైంది. మొదటిసారిగా 7వ నిజాం 1946లో పెద్దపల్లి-ఇందూరు రైల్వే లైన్‌ను నిర్మించేందుకు అంగీకరించారు. సర్వే కోసం అప్పటి రైల్వే శాఖకు ఆదేశాలు జారీ చేశారు. సర్వే పూర్తయిన సమయంలోనే భారతదేశంలో నిజాం రాజ్యం కలవడంతో పనులు నిలిచిపోయాయి. రైల్వేశాఖ పలుమార్లు పెద్దపల్లి-జగిత్యాల-నిజమాబాద్ రైల్వేలైన్ పనులను చేపడుతామని ప్రకటిస్తూ రావడమే తప్ప ఆచరణలో చూపలేదు.
పీవీ హయాంలో శంకుస్థాపన
తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నర్సింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1992లో పెద్దపల్లి-జగిత్యాల-ఇందూరు రైల్వేలైన్ నిర్మాణానికి మంజూరు లభించింది. 1993 జూన్ 30న పనులకు ప్రధానమంత్రి పీవీ శంకుస్థాపన చేశారు. పెద్దపల్లి-జగిత్యాల-నిజామాబాద్ రైల్వేలైన్ 178 కిలోమీటర్లు. జగిత్యాల వరకు 2007లో రైల్వేలైన్ పూర్తయింది. డిసెంబర్ 26న అప్పటి కరీంనగర్ ఎంపీ, ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ జగిత్యాలలో పుష్‌పుల్ రైలును ప్రారంభించారు. జగిత్యాల-కోరుట్ల-మెట్‌పల్లి-కమ్మరిపల్లి-మోర్తాడ్ దాకా గత సంవత్సరం డిసెంబర్ వరకే రైల్వేలైన్ పూర్తయింది. నిజామాబాద్-ఆర్మూర్ మధ్య 20 కిలోమీటర్ల మేర పనులు అసంపూర్తిగా మిగిలాయి. వాటిని పూర్తి చేసే పనిని గత డిసెంబర్ నుంచి యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. ఎట్టకేలకు 20కిలోమీటర్ల దూరం కూడా రైల్వేలైన్ పూర్తయింది.
నత్తకే నడక నేర్పిన పనులు
పెద్దపల్లి-కరీంనగర్-జగిత్యాల-ఇందూరు రైల్వేలైన్ పనులు నత్తలకే నడక నేర్పాయి. 45ఏళ్ల పాటు ప్రతిపాదనలకే పరిమితమైన రైల్వేలైన్ పనులు, మంజూరైన తర్వాతా అదే తీరున కొనసాగాయి. 178 కిలోమీటర్ల పొడవు రైల్వే లైన్ నిర్మాణానికి రూ.417 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. 1993 నుంచి 25ఏళ్ల వ్యవధిలో ఏటా కొద్దికొద్దిగా నిధులు మంజూరు కావడంతో పనులు ముక్కుతూ మూల్గుతూ సాగాయి. 1995 నుంచి 2002 వరకు ఈ మార్గానికి పెద్దగా నిధులు మంజూరు కాలేదు. తొలిసారి 2004-05 బడ్జెట్‌లో రూ.25.80 కోట్లు, 2006-07లో రూ.71.29కోట్లు, 2007-08లో రూ.35కోట్లు, 2008-09లో రూ.15కోట్లు, 2010-11లో రూ.130 కోట్లు, 2011-12లో రూ.40 కోట్లు, 2012-13లో రూ.50 కోట్లు, 2013-14లో రూ.30 కోట్లు కేటాయించారు.
ఎంపీగా కవిత కృషితో పెరిగిన నిధులు
2014 సాధారణ ఎన్నికల్లో నిజామాబాద్ లోక్‌సభ సభ్యురాలిగా కల్వకుంట్ల కవిత గెలుపొందిన తర్వాత ఈ రైల్వేలైన్ పనుల్లో వేగం పెరిగింది. నిధుల కేటాయింపుపై ఆమె ప్రత్యేక దృష్టి పెట్టారు. రైల్వేశాఖ మంత్రితో పాటు, ఇతర కేంద్ర మంత్రులను తరుచూ కలుస్తూ ఈ రైల్వే లైన్ ప్రాధాన్యతను వివరిస్తు వచ్చారు. 2014-15లో రూ.35 కోట్లు కేటాయించడంలో ఎనలేని కృషి చేశారు.
ఆ సంవత్సరం మంజూరైన నిధుల కంటే అధికంగా రూ.55.90 కోట్లు విడుదల చేయించడంలోనూ విజయం సాధించారు. 2015-16లో రైల్వేలైన్ నిర్మాణానికి పెద్ద

Translate to English
Translate to Hindi

1100 views
0

Mar 23 2017 (02:22)
Krrish
Krrish   135 blog posts
Re# 2207157-1              
Nizamabad peddapalli new line fully operational for trains 25 march onwards!!!💐💐💐💐💐👍
Translate to English
Translate to Hindi

923 views
0

Mar 23 2017 (08:15)
Sheikkaleemmaulali~
Sheikkaleemmaulali~   806 blog posts
Re# 2207157-2              
Yes suresh prabhu is coming to telangana on 25 march
Translate to English
Translate to Hindi
Scroll to Top
Scroll to Bottom
Go to Desktop site
Important Note: This website NEVER solicits for Money or Donations. Please beware of anyone requesting/demanding money on behalf of IRI. Thanks.
Disclaimer: This website has NO affiliation with the Government-run site of Indian Railways. This site does NOT claim 100% accuracy of fast-changing Rail Information. YOU are responsible for independently confirming the validity of information through other sources.
India Rail Info Privacy Policy