Spotting
 Timeline
 Travel Tip
 Trip
 Race
 Social
 Greeting
 Poll
 Img
 PNR
 Pic
 Blog
 News
 Conf TL
 RF Club
 Convention
 Monitor
 Topic
 #
 Rating
 Correct
 Wrong
 Stamp
 PNR Ref
 PNR Req
 Blank PNRs
 HJ
 Vote
 Pred
 @
 FM Alert
 FM Approval
 Pvt

RailCal app

site support

Gour Express: আমের শহর মালদা থেকে রোজ যায় শিয়ালদা - Joydeep Roy

Search Forum
<<prev entry    next entry>>
Blog Entry# 2081033
Posted: Dec 05 2016 (13:03)

8 Responses
Last Response: Dec 06 2016 (10:44)
General Travel
19251 views
2

Dec 05 2016 (13:03)   82855/Visakhapatnam - Kollam Sabarimala Suvidha Special | VSKP/Visakhapatnam Junction (8 PFs)
SLA12760~
SLA12760~   1536 blog posts
Entry# 2081033            Tags  
News about Suvidha Specials in today's Eenadu Paper (Telugu)
click here
విశాఖపట్నం: గంటలో గమ్యం చేరే విమానం ఎక్కడా.. 10 గంటలకు పైగా ప్రయాణించే రైలెక్కడ? రెండింటి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. విచిత్రం ఏంటంటే.. విమాన ధరలకు మించి రైలు టికెట్‌ ధరలు ఉండటం. ప్రత్యేక రైళ్ల పేరుతో జనాలమీద మోయలేని భారం వేసే పరిస్థితికి రైల్వే వ్యవస్థ వచ్చేసింది.
ఆదాయం పెంచుకోవాలంటే ఎన్నో మార్గాలుంటాయి. కానీ ప్రయాణికుల్నే లక్ష్యంగా మార్చుకుంటే ప్రభావం ఎలా ఉంటుందనేది ప్రత్యేక రైళ్ల రాకతో బట్టబయలైంది. విశాఖ నుంచి
...
more...
వివిధ ప్రాంతాలకు నడిచే పలు ప్రత్యేక రైళ్లను పరిశీలిస్తే ఈ విషయం చాలా స్పష్టమవుతోంది. సూపర్‌ఫాస్ట్‌ ఏసీ రైళ్లని, సువిధా రైళ్లనీ జనాల ముందుకు ప్రత్యేక రైళ్లుగా తీసుకొచ్చిన రైల్వే అధికారులు సాధారణ ఛార్జీలకన్నా 4రెట్లకు మంచి వసూలు చేసే స్థాయి వచ్చారు.
‘8’ అంకె మొదలైతే వణుకే..: అంతకుముందు ప్రీమియం రైళ్లనేవారు. ఇప్పుడు సువిధా రైళ్లంటున్నారు. జేబులు గుల్ల చేయడానికి ఏదైతే ఏంటి? ఇదే ఉద్దేశంతో సువిధా ప్రత్యేక రైళ్లను తీసుకొచ్చినట్లున్నారు. ఈ సువిధా రైళ్ల నెంబర్లు 8 అనే అంకెతోనే మొదలయ్యేలా ఏర్పాట్లు చేశారు. దీంతో ఈ అంకె వరసతో మొదలయ్యే రైళ్లంటేనే జనాలకు ఇప్పుడు వణుకు పుడుతోంది.
* 82801 సంఖ్యతో హౌరా-ఎర్నాకులం రైల్లో విశాఖ నుంచి ఎర్నాకులం వెళ్లాలంటే స్లీపర్‌ తరగతికి రూ.1855 తీసుకుంటున్నారు. ఎక్స్‌ప్రెస్‌ రైలుతో పోల్చితే ఇది 3రెట్ల కన్నా అధికం. అదే 3ఏ తరగతికి రూ.3940, 2ఏ తరగతికి రూ.4200 నిర్ణయించారు. ఇది ఎక్స్‌ప్రెస్‌ ఏసీ రైలుతో పోలిస్తే 2రెట్ల కన్నా ఎక్కువ. నీ 82841 సంఖ్యతో విశాఖ-కృష్ణరాజపురం రైలు నడుస్తోంది. బెంగళూరు సమీపంలో కృష్ణరాజపురం ఉంటుంది. ఇక్కడికి విశాఖ నుంచి వెళ్లాలంటే సాధారణ ఎక్స్‌ప్రెస్‌ స్లీపర్‌తో పోల్చితే 4రెట్లు అధికంగా వసూలు చేస్తున్నారు. ఇందులో స్లీపర్‌ రూ.1835, 3ఏ రూ.3360, 2ఏ రూ.4820గా ఉంది. ఇదే రైలులో తిరుపతి వెళ్లాలంటే స్లీపర్‌ రూ.1460, 3ఏ రూ.2630, 2ఏ రూ.3755 వసూలు చేస్తున్నారు.
* ఈ మధ్యకాలంలో వివాదాలతో వెలుగులోకి వచ్చిన మరోరైలు విశాఖ-బెంగళూరు సువిధా ఎక్స్‌ప్రెస్‌. యశ్వంతపూర్‌ నుంచి విశాఖ వచ్చేటప్పుడు తత్కాల్‌ ఛార్జీల్ని వసూలు చేస్తున్న ఈ రైలు ఇక్కడినుంచి తిరిగి వెళ్లేందుకు వీరబాదుడు బాదుతోంది. 82664 నెంబరుతో వెళ్లే ఈ రైలులో స్లీపర్‌ రూ.1865, 3ఏ రూ.3405, 2ఏ రూ.4870గా ఉంది.
* ఇలాంటి సువిధ రైళ్లు మరికొన్ని కూడా ఉన్నాయి. 82855 సంఖ్యతో విశాఖపట్నం-కొల్లాం వెళ్లే రైలులో స్లీపర్‌ రూ.2360, 3ఏ రూ.4135, 2ఏ రూ.4430 వసూలు చేస్తున్నారు. అలాగే 82831 నెంబరుతో నడిచే సంబల్‌పూర్‌-యశ్వంతపూర్‌ పరిస్థితి కూడా ఇంతే. ఈ మధ్యే విశాఖ-తిరుపతి మధ్య మరో కొత్త సువిధా రైలును ప్రకటించారు. ఇది 82851 నెంబరుతో జనాల్ని బాదేందుకు వస్తోంది.
* ఇలా తెచ్చిన సువిధా రైళ్లన్నీ విమానం వెళ్లేంత వేగంగానూ వెళ్లవుగానీ.. ఛార్జీల వరకూ చూస్తే విమాన ఛార్జీల కన్నా ఎక్కువగా వసూలు చేయడం జనాల్ని నోరెళ్లబెట్టేలా చేస్తోంది.
ఇతర ప్రత్యేక రైళ్లూ తక్కువేమీ కాదు..
రైల్వే అధికారులు విశాఖ నుంచి ఏసీ ప్రత్యేక రైళ్లను కూడా పలుచోట్లకు నడుపుతున్నారు. వీటి టికెట్‌ ధరలు కూడా నింగినంటుతున్నాయి. 12773 నెంబరుతో నడిచే షాలిమార్‌-సికింద్రాబాద్‌ ఏసీ సూపర్‌ఫాస్ట్‌ రైలులో విశాఖ నుంచి సికింద్రాబాద్‌ వెళ్లాలంటే 3ఏ తరగతిలో రూ.1055, 1ఏలో రూ.2525 వసూలు చేస్తున్నారు. 13గంటల పాటూ ప్రయాణం చేయాల్సిన ఈ రైలులో.. 1.10 గంటలో హైదరాబాద్‌ చేరే విమాన ఛార్జీ రేటుకు మించిపోయేలా ధర ఉంది. అలాగే 22807 నెంబరుతో సంత్రగచ్చి-చెన్నై ఏసీ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో విశాఖ నుంచి చెన్నై వెళ్లాలంటే కూడా అధికమొత్తం ఇచ్చుకోవాల్సి వస్తోంది. ఇందులో 3ఏ తరగతి రూ.1125, 1ఏ తరగతి రూ.2715గా నిర్ణయించారు.
ఏయే రైళ్లలో బాదుడు ఎలా ఉంటుందంటే.. : రద్దీ ఎక్కువగా ఉందని ఎప్పుడు డిమాండ్‌ వచ్చినా అదనపు రైళ్లు వేయాలనేది సహజం. కానీ దాన్నే ఆదాయ వనరుగా చేసుకుని ‘ప్రత్యేక రైళ్లు’ పేరుతో టికెట్‌ ధరల్ని విపరీతంగా పెంచేందుకు రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది.
* సువిధ రైలు అలా పుట్టిందే. దీన్నో ఆదాయ వనరుగా మార్చుకునేందుకు రైల్వేశాఖ ఒక ఎత్తుగడ వేసింది. మొత్తం రైల్లో ఉన్న సీట్లను 5 భాగాలు చేసి.. ఒక్కో భాగానికి ఒక్కో రేటును ఫిక్స్‌ చేశారు. పోనీ.. నచ్చిన భాగంలో సీటును పొందొచ్చా అంటే అలా కుదరదు. ఒక్కో భాగం పూర్తయితేనే తర్వాతి భాగానికి అనుమతిస్తారు. అంటే.. మొదటి 20శాతం టికెట్లకు తత్కాల్‌ రేట్లు, రెండో 20శాతం సీట్లకు 1.5రెట్ల టికెట్టు, మూడో 20శాతానికి 2రెట్లు, నాలుగో 20శాతానికి 2.5రెట్లు, ఐదో 20శాతం సీట్లకు 3రెట్ల టికెట్‌ను వసూలుచేస్తారు. ఇందులో ఒకసారి టికెట్‌ బుక్‌ చేసుకుంటే రద్దు చేసుకునే వెసులుబాటు ఉండదు. ప్రయాణం వద్దనుకుంటే డబ్బులు కూడా వదులుకోవాల్సిందే.
* అలాగే తత్కాల్‌ రైళ్లంటూ మరికొన్నింటినీ తీసుకొచ్చారు. వీటిలో సాధారణ టికెట్‌ ధరతో తత్కాల్‌ ఛార్జీని అదనంగా వసూలు చేస్తున్నారు.
* అలాగే ప్రత్యేక ధరల రైళ్లంటూ మరికొన్ని తెచ్చారు. వీటి టికెట్‌ ఎలా ఉంటుందంటే.. తత్కాల్‌ రైలుతో పోల్చితే అదనంగా రూ.200 నుంచి రూ.500 భారం పడుతుంది.
విమానానికే మొగ్గు.. : ప్రత్యేక రైళ్ల పేరుతో వసూలు చేస్తున్న డబ్బు.. విమాన ఛార్జీల్ని మించిపోతుండటంతో విశాఖ నుంచి మధ్యతరగతికి పైబడిన ప్రయాణికులంతా విమాన ప్రయాణంవైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో సువిధా రైళ్లలో 50 శాతానికి మించి సీట్లు నిండే పరిస్థితి కనిపించడం లేదు. చాలావరకు ఖాళీగానే ప్రయాణిస్తున్నాయి. భువనేశ్వర్‌, విశాఖ మధ్య ఐటీ నేపథ్య ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారు. వారు విమానం ఎక్కాలంటే విశాఖ రావాల్సిందే. ఇది అసౌకర్యంగా ఉండటంతో వారంతా సువిధ రైళ్లనే ఎక్కుతున్నారు. రైలు అధికారులు ఆలోచించింది కూడా ఇదే. అందుకే ఎక్కువ రైళ్లను హౌరా, భువనేశ్వర్‌ నుంచి నడుపుతున్నారు.
ధర పెంచక తప్పదు..
రైల్వే వ్యవస్థ నిలుదొక్కుకోవాలంటే ఈ తరహాలో ధరల్ని పెట్టక తప్పదని అంటున్నారు వాల్తేరు డివిజన్‌ అధికారులు. తాము అన్ని రైళ్లలో ధరల్ని పెంచడంలేదని, కేవలం ప్రత్యేక రైళ్ల విషయంలోనే ఈ రకమైన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. వీరు చెబుతున్నదాన్ని బట్టి దేశవ్యాప్తంగా రూ.32వేల కోట్లు రైల్వేకు నష్టం వస్తోందని అంటున్నారు. ప్రతీ జోన్‌లోనూ ఇలాంటి ప్రత్యేక రైళ్ల పేరుతోనే ఆదాయం పెంచుకునేందుకు వారు సిద్ధపడుతున్నారు. వచ్చే ఏడాది ‘హమ్‌సఫర్‌’ పేరుతో విశాఖ నుంచి మరిన్ని రైళ్లను వేస్తున్నారు. సీసీ కెమెరాలు, అగ్నిప్రమాదం జరగకుండా జాగ్రత్త చర్యలు, ఇతర వసతులతో వస్తున్న ఈ రైలులో టికెట్‌ అంత ఆషామాషీగా ఉండదని చెబుతున్నారు.
విశాఖపట్నం - తిరుపతి
విమాన ఛార్జీలు - రూ.3463
(ప్రయాణ సమయం 2.30 గంటలు)
ప్రత్యేక రైళ్ల ఛార్జీలు - రూ.1460 నుంచి రూ.3755
(ప్రయాణ సమయం - 12 గంటలు)
విశాఖపట్నం-బెంగళూరు
విమాన ఛార్జీలు - రూ.1500 నుంచి రూ.3100 వరకు
(ప్రయాణ సమయం - 1.35 గంటలు)
ప్రత్యేక రైళ్ల ఛార్జీలు - రూ.1865 నుంచి రూ.4870
విశాఖపట్నం - హైదరాబాద్‌
విమాన ఛార్జీలు - రూ.1300 నుంచి రూ.3200
(ప్రయాణ సమయం - 1.10 గంటలు)
ప్రత్యేక రైళ్ల ఛార్జీలు - రూ.1055 నుంచి రూ.2850
(ప్రయాణ సమయం - 10.30 నుంచి 12.30 గంటలు)
విశాఖపట్నం - చెన్నై
విమాన ఛార్జీలు - రూ.1300 నుంచి రూ. 4700 వరకు
(ప్రయాణ సమయం - 1.30 గంటలు)
ప్రత్యేక రైళ్ల ఛార్జీలు - రూ.1125 నుంచి రూ.2715

Translate to English
Translate to Hindi

4 Public Posts - Mon Dec 05, 2016

16830 views
1

Dec 05 2016 (13:27)
guest   40346 blog posts
Re# 2081033-5               Past Edits
Note ban effect kuda untadi le ede bulk bookings chesi poiuntaru changes undali kada unn old notes ela vadukuntaru konta mandi,
Cities anna ka flight ekkvallu unntaru ante kani andaru ekkaru
Translate to English
Translate to Hindi

2 Public Posts - Mon Dec 05, 2016

1 Public Posts - Tue Dec 06, 2016
Scroll to Top
Scroll to Bottom
Go to Desktop site
Important Note: This website NEVER solicits for Money or Donations. Please beware of anyone requesting/demanding money on behalf of IRI. Thanks.
Disclaimer: This website has NO affiliation with the Government-run site of Indian Railways. This site does NOT claim 100% accuracy of fast-changing Rail Information. YOU are responsible for independently confirming the validity of information through other sources.
India Rail Info Privacy Policy