Spotting
 Timeline
 Travel Tip
 Trip
 Race
 Social
 Greeting
 Poll
 Img
 PNR
 Pic
 Blog
 News
 Conf TL
 RF Club
 Convention
 Monitor
 Topic
 #
 Rating
 Correct
 Wrong
 Stamp
 PNR Ref
 PNR Req
 Blank PNRs
 HJ
 Vote
 Pred
 @
 FM Alert
 FM Approval
 Pvt

RailCal app

site support

Did you know that the Ganga & Kaveri rivers are connected? ... by Mysore Varanasi Express - Vishwanath Joshi

Search Forum
<<prev entry    next entry>>
Blog Entry# 5813477
Posted: Sep 03 2023 (16:54)

3 Responses
Last Response: Sep 13 2023 (22:49)
General Travel
25952 views
1

Sep 03 2023 (16:54)   07153/Narasapur - SMVT Bengaluru Special Fare Special | NS/Narasapur (3 PFs) | BZA/WAG-9H
saikarthik148~
saikarthik148~   3261 blog posts
Entry# 5813477            Tags   Past Edits
ప్రతిపాదనలకే పరిమితం.. రైళ్లకు లభించని అనుమతులు..

ప్లాట్‌ఫాంల సాకుతో రెడ్‌ సిగ్నల్‌ 8 గత ఏడాది నుంచి ప్రత్యేక రైళ్లతోనే సరి..

నరసాపురం నుంచి పాండిచ్చేరికైనా ఆనుమతివ్వాలని దక్షిణ మధ్య రైల్వే ప్రతిపాదన
...
more...

సదరన్‌ రైల్వేకు వినతి

రైల్వే బోర్డుపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని పలువురి అభిప్రాయం

నరసాపురం, సెప్టెంబరు 1: నరసాపురం–విజయవాడ మధ్య డబ్లింగ్‌ లైన్లు పూర్తయినా.. కొత్త రైళ్లు మాత్రం పట్టాలెక్కడం లేదు. ప్రతిపాదించిన రైళ్లకు అనుమతులు లభించడం లేదు. ఏదో సాకుతో రెడ్‌ సిగ్నిల్‌ వేస్తున్నారు. గడిచిన ఏడాది నుంచి స్పెషల్‌ రైళ్లతోనే ప్రయాణికులను మభ్యపెడుతున్నారు. తాజాగా నరసాపురం నుంచి ప్రతి ఆదివారం చెన్నైకు ఎక్స్‌ప్రెస్‌ రైలు నడపాలని ప్రతిపాదించారు. ఇందుకు షెడ్యూల్‌ సమయాన్ని కూడా సిద్ధం చేసి సదరన్‌ రైల్వేకు పంపారు. అయితే ఆ సమయాల్లో చెన్నై స్టేషన్‌లో ప్లాట్‌ఫాంలు ఖాళీ లేవన్న సాకుతో వెనక్కి పంపించారు. ప్రయాణికుల రద్దీని పరిగణనలోకి తీసుకుని కనీసం పాండిచ్చేరికైనా అనుమతి ఇవ్వాలని మరోసా రి దక్షిణ మధ్య రైల్వే విన్నవించింది. చెన్నై మీదుగా నడిపేందుకు ప్రణాళిక చేశారు. ఈ ప్రతిపాదనలపై సదరన్‌ రైల్వే ఏవిధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. ఇదే తరహాలో గతంలో బెంగళూరుకు రెగ్యులర్‌ రైలు నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రతిపాదనలు పంపించింది. బెంగళూరు, ఇటు యశ్వంతపూర్‌లో ప్లాట్‌ఫాంల కొరతను సాకుగా చూపించి ప్రతిపాద నలను వెనక్కి పంపారు. అప్పటి నుంచి నరసాపురం–బెంగళూరు, నరసాపు రం–యశ్వంత్‌పూర్‌ మధ్య వారంలో రెండు రూట్లలో స్పెషల్‌ రైళ్లు నడుపు తున్నారు. శుక్రవారం వయా గుడూరు మీదుగా బెంగళూరు, మంగళవారం వయా గుంటూరు మీదుగా యశ్వంత్‌పూర్‌లకు ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. సౌత్‌ వెస్ట్రన్‌ రైల్వే ఆనుమతి ఇవ్వకపోవడం వల్ల ఒక్క ఎక్స్‌ప్రెస్‌ కూడా రెగ్యులర్‌ కాలేదు. స్పెషల్‌ పేరుతోనే నడపడం వల్ల ప్రయాణికులపై అదనపు చార్జీల భారం తప్పడం లేదు. దీంతో పాటు షెడ్యూల్‌ ప్రకారం గమ్యస్థానాలకు చేరుకోవడం లేదు. గత ఏడాది విజయవాడ నుంచి నడుస్తున్న ఆమరావతిని నరసాపురం వరకు పొడిగించారు. ఈ ఏడాది జనవరి నుంచి ఈ ఎక్స్‌ప్రెస్‌ నడిపేందుకు అన్ని సిద్ధం చేశారు. కానీ ఇంతవరకు ఈ రైలుకు గ్రీన్‌ సిగ్నిల్‌ ఇవ్వలేదు. గతంలో వారణాశికి కూడా నడపాలని ప్రతిపాదించినా అది కార్యరూపం దాల్చలేదు. ఈవిధంగా ప్రతిపాధించిన రైళ్లు పట్టాలెక్కపోవడం, అనుమతులు రాకపోవడంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు రైల్వే బోర్డుపై ఒత్తిళ్లు తీసుకురాకపోవడం వల్లే ప్రయాణికులకు కష్టాలు తప్పడం లేదన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి.

Translate to English
Translate to Hindi

20656 views
0

Sep 13 2023 (22:26)
NaagendraV
NaagendraV   331 blog posts
Re# 5813477-1              
Really very bad time running for BZA division from decades... the last train BZA division got approval for CTT-LTT beyond SCR jurisdiction in 2014.... For Branch line(BZA-GDV-NDD) no need to discuss.. very pathatic situation.
Translate to English
Translate to Hindi

19481 views
0

Sep 13 2023 (22:29)
saikarthik148~
saikarthik148~   3261 blog posts
Re# 5813477-2              
yes atleast railway board can change SPL as regular train NS-SMVB there are many trains in North which are recently converted and south also one or two
Translate to English
Translate to Hindi

19624 views
1

Sep 13 2023 (22:49)
NaagendraV
NaagendraV   331 blog posts
Re# 5813477-3              
I'm not expecting this in near future...Looks SCR zone not focusing on this.. at zone level discussions even BZA proposed...
Translate to English
Translate to Hindi
Scroll to Top
Scroll to Bottom
Go to Desktop site
Important Note: This website NEVER solicits for Money or Donations. Please beware of anyone requesting/demanding money on behalf of IRI. Thanks.
Disclaimer: This website has NO affiliation with the Government-run site of Indian Railways. This site does NOT claim 100% accuracy of fast-changing Rail Information. YOU are responsible for independently confirming the validity of information through other sources.
India Rail Info Privacy Policy