Spotting
 Timeline
 Travel Tip
 Trip
 Race
 Social
 Greeting
 Poll
 Img
 PNR
 Pic
 Blog
 News
 Conf TL
 RF Club
 Convention
 Monitor
 Topic
 #
 Rating
 Correct
 Wrong
 Stamp
 PNR Ref
 PNR Req
 Blank PNRs
 HJ
 Vote
 Pred
 @
 FM Alert
 FM Approval
 Pvt

Tamil Nadu Express - தங்களை அன்புடன் வரவேற்கிறது - Swaroop Kutti

Search Forum
<<prev entry    next entry>>
Blog Entry# 928084
Posted: Dec 07 2013 (18:02)

25 Responses
Last Response: Dec 11 2013 (22:59)
General Travel
4218 views
3

Dec 07 2013 (18:02)   KZJ/Kazipet Junction (3 PFs)
 
Jagan Mohan Reddy
Jagan Mohan Reddy   1835 blog posts
Entry# 928084            Tags  
Saakshi article about Kazipet new coach factory dont know weather it comes or not but iam praying to come ASAP
click here
సాక్షి, హన్మకొండ: రైలు బోగీల తయారీ కర్మాగారం జిల్లాకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్ర కేబినెట్ గురువారం ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు-2013లో ‘తెలంగాణలో కోచ్ కర్మాగారం నిర్మాణానికి భారతీయ రైల్వే సర్వే చేపట్టాలి’ అని పేర్కొంది. ఈ ప్రతిపాదన.. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణంపై ఆశలు రేకెత్తించింది. 25 ఏళ్ల క్రితం రైల్ కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం వరకు వచ్చి.. పంజాబ్ రాష్ట్రానికి తర లిపోయింది. రైల్ కోచ్ తెలంగాణలో అని పేర్కొన్నప్పటికీ... గత పరిణామాల నేపథ్యంలో అది కాజీపేటకు మంజూరయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ మేరకు మన ఎంపీలు సమష్టిగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి
...
more...
తేవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇక భారమంతా వారిదే.
రైలు పెట్టెలకు తీవ్ర కొరత..
ప్రస్తుతం భారతీయ రైల్వే ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో రైలు కోచ్‌ల లభ్యత ముఖ్యమైనది. ప్రస్తు తం కపుర్తలా, చెన్నై, రాయ్‌బరేలీలలో రైలు పెట్టెల తయారీ కర్మాగారాలు ఉన్నాయి. ఇక్కడ ఏడాదికి 3,500 వరకు రైలు పెట్టెల తయారీ, పునర్ నిర్మాణం జరుగుతోంది. దేశవ్యాప్తంగా కొత్త రైళ్ల డిమాండ్‌కు తగ్గరీతిలో రైలు పెట్టెల తయారీ లేదు. దీంతో కొత్త రైళ్లను ప్రవేశపెట్టడం కష్టంగా మారింది. అరతేకాకుం డా ప్రస్తుతం మన దగ్గర వినియోగంలో ఉన్న రైలు పెట్టెల్లో 95 శాతానికి పైగా పాత సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందినవే.
భవిష్యత్‌అవసరాలు, భద్రతా ప్రమాణాలు, నాణ్యత, వేగం వంటి కీలక అంశాల్లో సాంకేతికంగా వెనుకబడి ఉన్నాయి. అందుకే రైల్వేశా ఖ దేశంలో వివిధ ప్రాంతాల్లో కొత్తగా రైలు కోచ్ తయారీకర్మాగారాలను నిర్మించేందుకు ఆసక్తి చూపిస్తోంది. అందులో భాగంగానే ఇప్పటికే పశ్చిమబెం గాల్, కేరళలో రెండు పరిశ్రమలకు పచ్చజెండా ఊ పింది. వీటితోపాటు దేశంలో పలు కీలక ప్రాంతాల్లో కర్మాగారాలు నెలకొల్పేందుకు సిద్ధంగా ఉంది.

కాజీపేటకే అవకాశం..
భారతీయ రైల్వేశాఖ కొత్తగా రైల్ కోచ్ ఫ్యాక్టరీని తెలంగాణలో నిర్మించాలని తలపెడితే అందులో మొ దటి ప్రాధాన్యం కాజీపేటకే దక్కుతుంది. కాజీపేట స్టేషన్ దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉండడం వల్ల.. ఇక్కడ ఫ్యాక్టరీని నిర్మిస్తే ఉత్తర, దక్షిణ ప్రాంతాల మ ద్య సమతుల్యత సాధించే అవకాశం ఉంది. కాజీపేట మీదుగా వెళ్తున్న న్యూఢిల్లీ-చెన్నై గ్రాండ్‌‌ర టంక్ మా ర్గాన్ని డబ్లింగ్ నుంచి ట్రిప్లింగ్‌కి అప్‌గ్రేడ్ చేయనున్నా రు. దీంతోపాటు జాతీయ రహదారి 202, ఎయిర్‌డ్రోమ్ వంటి మౌలిక వసతులు ఉన్నాయి. అంతేకాకుండా తుపాను వచ్చే అవకాశం లేకపోవడం, భూ కంపం తీవ్రత తక్కువగా ఉండే జోన్‌లో ఉండడం వంటి ప్రకృతి అంశాలు కాజీపేటకు కలిసొచ్చే అంశాలు.

రెండు వేల ఎకరాల రైల్వే స్థలం
కాజీపేటలో రైల్వేకు సంబంధించి రెండు వేల ఎకరాల స్థలం ఉంది. స్టీమ్ ఇంజిన్ల కాలంలో కాజీపేట రైల్వే జంక్షన్ ఇప్పుడు స్టేషన్ ఉన్న స్థలం నుంచి బోడగుట్ట వరకు విస్తరించి ఉండేది. ఆ రోజుల్లో స్టీమ్ ఇంజిన్లతో నడపడం వల్ల మధ్యలో మెయింటనెన్స్ కోసం రైళ్లు, గూడ్సు బండ్లు కాజీపేట స్టేషన్‌లో రోజుల తరబడి నిలిచి ఉండేవి. వీటికి ప్రస్తుతం ఉన్న రైల్వే ట్రాక్ వెంబడి దర్గా కాజీపేట నుంచి మొదలు పెడితే రాంపూర్ వరకు రైల్వేట్రాక్, లూప్‌లైన్లు ఉండేవి. బోడగుట్ట వద్ద క్యారేజ్, వ్యాగన్స్ మెయింటనెన్స్ డిపార్ట్‌మెంట్ (సీ అండ్ డబ్ల్యూ) ఉండేది. అయితే స్టీమ్ ఇంజిన్ల కాలం ముగిసిన తర్వాత సీ అండ్ డబ్ల్యూ, లూప్‌లైన్లు వినియోగించడం లేదు. అంతా కలిపి దాదాపు దర్గా కాజీపేట నుంచి నష్కల్ వరకు ప్రస్తుతం ఉన్న రైల్వే ట్రాక్ వెంబడి దాదాపుగా రెండు వేల ఎకరాలకు పైగా రైల్వే స్థలం అందుబాటులో ఉంది.

పాతికేళ్ల క్రితం చేజారిన అవకాశం
మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు 1980లో హన్మకొండ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికై ఇందిరాగాంధీ కేబినెట్‌లో హోంమంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ఆయన కాజీపేటకు రైల్ కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేయించారు. ఇందిరాగాంధీ చేతుల మీదుగా శంకుస్థాపన చేయించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే దురదృష్టవశాత్తు ఇందిరాగాంధీ హత్యకు గురికావడం... సిక్కుల ఊచకోత వంటి సంఘటనలు చోటుచేసుకున్నారుు. ఆ తర్వా త ప్రధానిగా ఎన్నికైన రాజీవ్‌గాంధీ సిక్కులను శాంతపరిచేందుకు కాజీపేటకు మంజూరైన కోచ్ ఫ్యాక్టరీని పంజాబ్‌లోని కపుర్తలాకు తరలించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అక్కడ ప్రస్తుతం ఈ ఫ్యాక్టరీలో ఐదువేల మందికి పైగా కార్మికులు ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారు. అదేవిధంగా రైల్ కోచ్ కర్మాగారం కాజీపేటకు మంజూరైతే పారిశ్రామికంగా జిల్లా అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది

Translate to English
Translate to Hindi

20 Posts

1883 views
0

Dec 11 2013 (22:49)
guest   40346 blog posts
Re# 928084-21              
tappu undi bhai
already scr zone undi for kzj
scr wants all rail factory's with 150-200km radius
zone vastadani evaru chepaaru? new zone anta easy na
wagaon coach factory ke 4-5
...
more...
years patindi new zone orike radu

Translate to English
Translate to Hindi

1950 views
1

Dec 11 2013 (22:49)
SRG^~
SRG^~   44887 blog posts
Re# 928084-22              
Mohan garu please meevallu maavaallu ani thedalu pettavaddu..
Translate to English
Translate to Hindi

1845 views
0

Dec 11 2013 (22:52)
guest   40346 blog posts
Re# 928084-23              
krnt kuda anuke sanction aindai coach rehabliation factory naku teslii adi vache saraki 5-10 years patudundi
adi scr ki 200km radius ee
Translate to English
Translate to Hindi

1801 views
0

Dec 11 2013 (22:56)
G.MPatel
G.MPatel   1970 blog posts
Re# 928084-24              
ok....Important station ayina proper infra structure ledu...Division proposal alane untundi....wagon factory foundation stone padaledu.....new trais lev...pit lines two propose cheste only one sanctioned, daneeke money sanction cheyadam ledu........
Translate to English
Translate to Hindi

1817 views
0

Dec 11 2013 (22:59)
SRG^~
SRG^~   44887 blog posts
Re# 928084-25              
Vastayi saaru anni okesaari kavalante etta...Koncham opika pattandi RB funds ivvaka pote SCR emi chestundi..
Translate to English
Translate to Hindi
Scroll to Top
Scroll to Bottom
Go to Desktop site
Important Note: This website NEVER solicits for Money or Donations. Please beware of anyone requesting/demanding money on behalf of IRI. Thanks.
Disclaimer: This website has NO affiliation with the Government-run site of Indian Railways. This site does NOT claim 100% accuracy of fast-changing Rail Information. YOU are responsible for independently confirming the validity of information through other sources.
India Rail Info Privacy Policy