Spotting
 Timeline
 Travel Tip
 Trip
 Race
 Social
 Greeting
 Poll
 Img
 PNR
 Pic
 Blog
 News
 Conf TL
 RF Club
 Convention
 Monitor
 Topic
 #
 Rating
 Correct
 Wrong
 Stamp
 PNR Ref
 PNR Req
 Blank PNRs
 HJ
 Vote
 Pred
 @
 FM Alert
 FM Approval
 Pvt

RailFans never grow old

Search Forum
<<prev entry    next entry>>
Blog Entry# 953282
Posted: Jan 02 2014 (19:42)

15 Responses
Last Response: Jan 02 2014 (21:59)
General Travel
88709 views
0

Jan 02 2014 (19:42)   77271/Kakinada Town - Kotipalli Rail Bus | RBCS/Ramachandrapuram (2 PFs)
 
guest   1081 blog posts
Entry# 953282            Tags  
కోటిపల్లి-కాకినాడ ఠైలు మార్గానికి రెడ్ సిగ్నల్!
09/12/2012
TAGS:
రామచంద్రపురం, డిసెంబర్ 8: లోక్‌సభ స్పీకర్ దివంగత గంటి మోహన చంద్ర బాలయోగి పుణ్యమా అని, బ్రిటిష్ కాలంలోనే తొలగించిన కాకినాడ- కోటిపల్లి రైల్వే మార్గం పునరుద్ధరణ జరిగిన నాటి నుండీ ఈ రూట్‌ను ఏ విధంగా తొలగించాలా అన్న అధికారుల అనాలోచిత ప్రయత్నాలకు మళ్లీ ప్రస్తావనకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. కోటిపల్లి నుండి అమలాపురం మీదుగా నరసాపురానికి రైలు మార్గం నిర్మించడం ద్వారా కోనసీమలో రైలు కూత వినిపిస్తానని గత తొమ్మిదేళ్లుగా అమలాపురం ఎంపి జివి హర్షకుమార్ ప్రకటనలు
...
more...
చేస్తున్నప్పటికీ, వాస్తవ రూపం దాల్చడం లేదు. రైల్వే శాఖా మంత్రిగా పనిచేసిన మమతా బెనర్జీ చేతుల మీదుగా అమలాపురంలో ఈ పథకానికి పునాది రాయి పడినప్పటికీ.. ఆమె మళ్లీ రైల్వే మంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ, ఇందుకు సంబంధించిన నిధులను విడుదల చేయలేదు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో రైలు కూత విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఈ ప్రాంత ప్రజానీకానికి మళ్లీ ఆశలు చిగురింపచేసే ప్రయత్నాలను రాజకీయవేత్తలు నిర్వీరామంగా చేస్తూనే వస్తున్నారు. కోటిపల్లి నుండి కాకినాడకు రెండు మూడు తడవులు రైలు ప్రయాణీకుల నిమిత్తం రైళ్లను తిప్పాలని రైల్వే అధికారులను ఎన్నిసార్లు కోరినా అరణ్య రోదనగా మిగిలింది. అత్యల్ప ఖర్చుతో ప్రయాణీకుడు ప్రయాణంచేసే పరిస్థితిని రైల్వే శాఖ కల్పించినప్పటికీ.. డివిజన్ స్థాయిలో అధికారులు ఈ అంశంపై ఎప్పుడూ ఆదరణ చూపకపోవడం కేవలం ఈ ప్రాంత ప్రజాప్రతినిధుల నిర్లక్ష్య ధోరణికి అద్దం పడుతోంది. రామచంద్రపురం రైల్వే స్టేషన్‌లో రైల్వే టిక్కెట్‌లు అమ్మకం, తదనంతరం రిజర్వేషన్ టిక్కెట్లు అమ్మకంతోపాటు తత్కాల్ టిక్కెట్లను జారీచేసే ప్రక్రియ జరుగుతోంది. ప్రతీ రోజూ రూ.20వేల మేరకు రైల్వే శాఖకు టిక్కెట్ల అమ్మకం ద్వారా ఆదాయం లభిస్తోంది. గతంలో రామచంద్రపురం రైల్వే స్టేషన్ నుండి కేరళ, అస్సాంకు ధాన్యం ఎగుమతి నిర్వహించే కృషి జరిగింది. అందుకుగాను ఫ్లాట్‌ఫాంలను నిర్మించేందుకు ఈ ప్రాంత రైసు మిల్లర్లు సంఘటితంగా కృషిచేసి, నెలకు కోటిన్నర రూపాయలు ఆదాయం రైల్వే శాఖకు వచ్చే ప్రయత్నం చేసారు. ఆ తరువాత రైల్వే వేగన్లను తీసుకువెళ్లే క్రమంలో పలు ప్రాంతాలలో రైల్వే ట్రాక్ ఇబ్బంది పెడుతోందన్న అంశాన్ని రైల్వే గూడ్స్ డ్రెవర్లు వ్యక్తపరచడంతో, ఇంజనీర్ల నిర్వాకాన్ని బహిర్గతం కాకుండా ఉండేందుకుగాను, ఆదాయం పుష్కలంగా వస్తున్నప్పటికీ, గూడ్స్ రవాణా ప్రక్రియను అర్ధాంతరంగా నిలిపివేసారు. ప్రస్తుతం రైల్వే ఉన్నతాధికారులు, మంగళవారం మినహా మిగిలిన రోజులలో కాకినాడ-కోటిపల్లి రైలు మార్గంలో తిరిగే రైలు బస్‌ను యధావిధిగా సింగిల్ ట్రిప్ నిర్వహిస్తూ, రామచంద్రపురం, కోటిపల్లి రైల్వే స్టేషన్లలో పనిచేసే వారినందర్నీ వేరొక ప్రాంతానికి తరలించేందుకు రహస్యంగా.. వ్యూహాత్మకంగా పథకం రచించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే రెండుచోట్ల మాత్రమే గేట్‌మెన్లను ఉంచి, మిగిలిన లెవెల్ క్రాసింగ్‌ల వద్ద గేట్‌మెన్లను తొలగించారు. రైలు బస్‌లోనే ఒక గేట్‌మేన్ ప్రయాణం చేస్తూ, గేట్ వద్దకు వచ్చేసరికి రైలు బస్‌ను ఆపి, గేట్ మూసి, రైలు బస్ గేటు దాటిన తరువాత తిరిగి గేట్‌ను తెరిచే విధానాన్ని రైల్వే అధికారులు అమలులోకి తీసుకువచ్చారు. కోట్లాది రూపాయలు వ్యయపరచి, రామచంద్రపురంలోనూ, కోటిపల్లిలోనూ నిర్మించిన రైల్వే ఉద్యోగుల వసతి గృహాలు అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారాయి. ఈ పరిస్థితులలో రైల్వే ఆస్తిని పకడ్బందీగా పరిరక్షించుకోవాల్సిన రైల్వే శాఖ, ఇంజనీర్ల నిర్వాకంతో అనాలోచిత చర్యలకు పాల్పడటం పట్ల రైల్వే వినియోగదారులు ఆగ్రహంతో ఉన్నారు. కాకినాడలో ఆదివారం ప్రత్యేక ఎసి ట్రైన్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు కాకినాడ-కోటిపల్లి రైల్వే లైన్ అంశంపై విధానపరమైన నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా నివేదికలను సిద్ధం చేస్తున్నట్లు, అందుకుగాను విజయవాడ రైల్వే డివిజన్ అధికారులు ముమ్మర కసరత్తు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. జిల్లాలోని ముగ్గురు ఎంపిలు ఈ అంశంపై రాష్ట్రానికే చెందిన రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళి, అధికారుల అనాలోచిత చర్యలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు, రైల్వే వినియోగదారులు కోరుతున్నారు.

Translate to English
Translate to Hindi

12 Public Posts - Thu Jan 02, 2014

39784 views
0

Jan 02 2014 (21:53)
Parle Poppins   1172 blog posts
Re# 953282-13              
If GMC Balayogi was alive this would have been a "Done and Dusted" case.
Translate to English
Translate to Hindi

2 Public Posts - Thu Jan 02, 2014
Scroll to Top
Scroll to Bottom
Go to Desktop site
Important Note: This website NEVER solicits for Money or Donations. Please beware of anyone requesting/demanding money on behalf of IRI. Thanks.
Disclaimer: This website has NO affiliation with the Government-run site of Indian Railways. This site does NOT claim 100% accuracy of fast-changing Rail Information. YOU are responsible for independently confirming the validity of information through other sources.
India Rail Info Privacy Policy