రైల్వే బడ్జెట్‌లో ‘దక్షిణ కోస్తా రైల్వే జోన్’కు నిధుల కేటాయింపు ఉంటుందని, ఆ వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని వాల్తేరు డీఆర్‌ఎం మనోజ్‌కుమార్ సాహు పేర్కొన్నారు.
విశాఖ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులకు రీటెండర్‌డీఆర్‌ఎం మనోజ్‌కుమార్ సాహు
...
more... ఈనాడు, విశాఖపట్నం : రైల్వే బడ్జెట్‌లో ‘దక్షిణ కోస్తా రైల్వే జోన్’కు నిధుల కేటాయింపు ఉంటుందని, ఆ వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని వాల్తేరు డీఆర్‌ఎం మనోజ్‌కుమార్ సాహు పేర్కొన్నారు. సోమవారం డీఆర్‌ఎం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వాల్తేరు డివిజన్ పరిధిలోని దువ్వాడ, సింహాచలం, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి, శ్రీకాకుళం, నౌపడా, బొబ్బిలి, పార్వతీపురం, అరకు రైల్వేస్టేషన్లను అమృత్‌భారత్ పథకంలో భాగంగా రూ.800 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ పనులన్నీ కొనసాగుతున్నాయన్నారు. విశాఖ స్టేషన్ పునరాభివృద్ధి పనులు గతంలో నిలిచిపోయాయి. మళ్లీ త్వరలోనే ప్రారంభిస్తామని, కొత్తగా టెండరు పిలిచినట్లు తెలిపారు. గత బడ్జెట్ కన్నా ఈ ఏడాది కొంచెం ఎక్కువ బడ్జెట్ రాష్ట్రానికి కేటాయించడం హర్షణీయమన్నారు. ఏపీ నుంచి ఒడిశా, తెలంగాణ రాష్ట్రాలను కలుపుతూ నాలుగు వందేభారత్ రైళ్లను నడుపుతున్నామని, కొత్త రైళ్ల ఏర్పాటులో మరింత ప్రాధాన్యం దక్కుతుందన్నారు. ముఖ్యంగా దేశంలో దూర ప్రాంతాల మధ్య వందేభారత్ సౌకర్యాలతో సామాన్యులకు అందుబాటు ఛార్జీతో ప్రారంభించిన అమృత్‌భారత్ రైలు విశాఖ మీదుగా ప్రయాణిస్తుందన్నారు. వంద నుంచి 130 కి.మీ.వేగంతో వెళ్లే రైళ్ల కోసం రైల్వే లైన్లను ఆధునికీకరిస్తున్నట్లు చెప్పారు. వాల్తేరు డివిజన్‌తో కూడిన జోన్ ఏర్పాటుపై విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని వ్యాఖ్యానించారు.
#SCoR #BZA #GTL #GNT #WAT #VSKP
please wait...Translate to EnglishWaltair DRM Manoj Kumar Sahu stated that the railway budget will include funding for the South Coast Railway Zone, but details are yet to be revealed. He also mentioned that the Visakha Railway Station redevelopment work will restart soon with a new tender.
In a press conference held at the DRM office on Monday, he said that railway stations in Waltair division – Duvvada, Simhachalam, Kottavalasa, Vijayanagaram, Cheepurupalli, Srikakulam, Naupada, Bobbili, Parvathipuram, and Araku – are being developed under the Amrit Bharat scheme with ₹800 crore. These works are currently underway. He added that this year's budget allocation for the state is slightly higher than last year's. Four Vande Bharat trains are running connecting AP, Odisha, and Telangana, and more such trains are planned. The Amrit Bharat train, offering affordable travel between distant locations, will pass through Visakhapatnam. Railway lines are being modernized for trains traveling at speeds of 100-130 kmph. He commented that a policy decision is needed regarding the formation of a zone including the Waltair division.
#SCoR #BZA #GTL #GNT #WAT #VSKP
please wait...Translate to HindiRail Budget mein Dakshin Kosta Railway Zone ke liye fund allocate kiye jaayenge, yeh details abhi aani baaki hai, yeh baat Waltair DRM Manoj Kumar Sahu ne kahi. Visakha Railway Station ke punaravikash ke kaam ke liye retender kiya gaya hai, DRM Manoj Kumar Sahu ne bataya. Waltair division ke Duvvada, Simhachalam, Kottavalasa, Vijayanagaram, Cheepurupalli, Srikakulam, Naupada, Bobbili, Parvatipuram, Araku railway stations ko Amrit Bharat Yojana ke tahat 800 crore rupees se develop kiya ja raha hai. Yeh kaam chal rahe hain. Visakha station ka punaravikash ka kaam pehle ruk gaya tha, lekin jaldi hi shuru hoga, aur naya tender bulaya gaya hai. Is saal pehle ke budget se thoda zyada budget state ko mila hai, yeh achchi baat hai. AP se Odisha aur Telangana ko jodte hue chaar Vande Bharat trains chala rahe hain, aur nayi trains ki taiyari mein zyada dhyan diya ja raha hai. Desh ke door dauraano ke beech Vande Bharat ki suvidha se aam logo ke liye kam daam mein Amrit Bharat train Visakha se ho kar jaati hai. 100 se 130 km ki speed se chalne wali trains ke liye railway lines ko modernise kiya ja raha hai. Waltair division waale zone ke banane pe policy level decision lena hai.