Spotting
 Timeline
 Travel Tip
 Trip
 Race
 Social
 Greeting
 Poll
 Img
 PNR
 Pic
 Blog
 News
 Conf TL
 RF Club
 Convention
 Monitor
 Topic
 #
 Rating
 Correct
 Wrong
 Stamp
 PNR Ref
 PNR Req
 Blank PNRs
 HJ
 Vote
 Pred
 @
 FM Alert
 FM Approval
 Pvt

এক রাজ্য, দুই রাণী।নাম তাদের, শালিমার ও আলিপুরদুয়ার রাজ্যরানী - Dip

Search Forum
Filters:
Page#    9 Blog Entries  next>>
Rail News
14658 views
0

Aug 30 (14:57)   South Coast Railway Zone Announcement Slows Progress in Waltair Division

NaagendraV   46 news posts
Entry# 6173292   News Entry# 567220         Tags   Past Edits
Vizag: మాటల్లోనే జోన్‌.. ఎప్పటికప్పుడు కాలం గడిపేస్తున్న రైల్వే శాఖ

The announcement of a new South Coast Railway Zone with Visakhapatnam as its headquarters has led to the gradual decline of the importance of the Waltair Division. While the announcement was made in 2019, the delayed implementation has resulted in various losses. The DPR for the South Coast Railway Zone is...
more...
complete and submitted to the Railway Board, but the subsequent process has stalled. Concerns about the zone's development have resurfaced in light of the rapid progress made in establishing the Rayagada Division. Despite repeated reviews and promises, little progress has been made. Some suggest that political pressure could expedite the process, as the BJP is part of the ruling coalition. There are discussions about establishing a sub-division in Visakhapatnam instead of a full-fledged Waltair division, with an ADRM-level officer overseeing railway assets, operations, and projects. However, the public demands a full-fledged zone with the Waltair division. The efficiency of local authorities and representatives in fulfilling these demands remains to be seen. Criticisms abound that the East Coast Railway is neglecting Visakhapatnam regarding train allocation, halting arrangements, and the allocation of new coaches, while other divisions receive priority.

Visakhapatnam ko centre banaake South Coast Railway Zone ka announcement hone ke baad, Waltair Division ka importance kam hota ja raha hai. 2019 mein announcement hua tha, lekin implementation mein delay ki wajah se har taraf loss ho raha hai. South Coast Railway Zone ke liye DPR (Detailed Project Report)...
more...
to ban gayi hai aur Railway Board ko submit bhi ho gayi hai, par uske baad ka process ruk gaya hai. Rayagada Division banne ki tez raftar dekhte hue, zone ke baare mein phir se baat ho rahi hai. Har baar reviews aur promises ke saath hi baat chali aati hai. Kuchh log yeh bhi keh rahe hain ki chaarhi BJP sarkar mein partner hai toh Railway Board aur Railway Ministry par political pressure daal kar is process ko jaldi karvaaya ja sakta hai. Waltair division ki jagah Visakhapatnam mein sub-division banane ki baat bhi chali hai, jahan ADRM level ka officer railway assets, operations aur projects ko dekhta hai. Lekin, logon ki demand hai ki full-fledged zone banaye jaye jisme Waltair division bhi shamil ho. Dekhna hai ki yeh demand puri karne mein local authorities aur representatives kitna successfull hote hain. Log yeh bhi keh rahe hain ki East Coast Railway Visakhapatnam ko neglect kar raha hai train allocation, halting arrangement, aur new coaches ke allocation mein, jabki dusre divisions ko priority di ja rahi hai.

Rail News
14723 views
0

Aug 30 (14:58)
NaagendraV
NaagendraV   386 blog posts
Re# 6173292-1              
Article source:

కేంద్ర ప్రభుత్వం విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ను ప్రకటించిన తర్వాత వాల్తేరు డివిజన్‌కు క్రమంగా ప్రాధాన్యం తగ్గుతూవస్తుంది. 2019లో ప్రకటన వెలువడినా..ఏర్పాటు ఆలస్యం అవుతుండడంతో అన్ని రకాలుగా  నష్టపోవాల్సి వస్తోంది.

ఎక్కడికక్కడ
...
more...
ఆగిపోతున్న అభివృద్ధి పనులు

‘దక్షిణ కోస్తా’ జాప్యంతో అంతా నష్టమే

వాల్తేరు డివిజన్‌కు తగ్గిపోతున్న ప్రాధాన్యం



ఈనాడు, విశాఖపట్నం: కేంద్ర ప్రభుత్వం విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ను ప్రకటించిన తర్వాత వాల్తేరు డివిజన్‌కు క్రమంగా ప్రాధాన్యం తగ్గుతూవస్తుంది. 2019లో ప్రకటన వెలువడినా..ఏర్పాటు ఆలస్యం అవుతుండడంతో అన్ని రకాలుగా  నష్టపోవాల్సి వస్తోంది.

దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు సంబంధించి ఇప్పటికే డీపీఆర్‌ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక) పూర్తయింది. అది రైల్వేబోర్డుకు చేరింది. అనంతరం జరగాల్సిన ప్రక్రియ మాత్రం నిలిచిపోయింది. రాయగడ డివిజన్‌ ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్న తరుణంలో జోన్‌ అంశం మళ్లీ తెరమీదికొచ్చింది. ఇలా ఎప్పటికప్పుడు సమీక్షలు, మాటలతో సరిపెట్టేస్తు వచ్చారు. కూటమి ప్రభుత్వంలో భాజపా భాగస్వామ్యం అయినందున... రాజకీయపరంగా రైల్వేబోర్డు, రైల్వేమంత్రిత్వ శాఖపై ఒత్తిడి తెస్తే వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ ముందుకు వెళ్తుందని పలువురి సూచన.

ఎన్నో రూపాల్లో...

సబ్‌డివిజన్‌తో సరిపెడతారా?

వాల్తేరు డివిజన్‌కు బదులు విశాఖలో సబ్‌డివిజన్‌ ఏర్పాటు చేయనున్నట్లు గతంలో రైల్వే బోర్డుకు నివేదిక సమర్పించారు. దీని ద్వారానే రైల్వే ఆస్తులు, రైళ్ల నిర్వహణ, ఇతర ప్రాజెక్టులను పర్యవేక్షించనున్నారు. ఏడీఆర్‌ఎం స్థాయి అధికారిని ఇక్కడ నియమించనున్నారు. అయితే రాష్ట్ర ప్రజలు మాత్రం వాల్తేరు డివిజన్‌తో కూడిన జోన్‌ కావాలని డిమాండు చేస్తున్నారు. దీనిపై అధికారులు, ప్రజాప్రతినిధులు ఎంత వరకు కృషి చేసి సఫలీకృతం కాగలరో వేచి చూడాలి.

విశాఖకు రాకుండా..

ప్రయాణికుల డిమాండుకు తగ్గట్టు రైళ్లను కేటాయించడంలో విశాఖపై తూర్పుకోస్తా రైల్వే తీవ్ర నిర్లక్ష్యం చూపుతుందన్న విమర్శలు ఉన్నాయి. ఇతర జోన్లకు చెందిన రైళ్లు నడుస్తున్నా హాల్టింగ్‌ విషయంలోనూ అప్రాధాన్యం ఇస్తున్నారు. పలు ప్రత్యేక రైళ్లు విశాఖకు రాకుండానే గోపాలపట్నం- దువ్వాడ మీదుగా వెళ్లిపోతున్నాయి. కొత్త కోచ్‌లను ఇతర డివిజన్లకు కేటాయిస్తున్నా...వాల్తేరుకు మొండిచేయి చూపుతున్నారు. 


#SCOR #APRailwayInfra #BZA #GTL #GNT #VSKP

Translate to English
Translate to Hindi
Rail News
24994 views
0

Aug 16 (08:16)   Railway Board Approves DPR for Amaravati Rail Line, Construction to Begin Soon

NaagendraV   46 news posts
Entry# 6158949   News Entry# 565380         Tags   Past Edits
AP News: రూ.2,047 కోట్లతో అమరావతికి రైలు మార్గం

The Railway Board has approved the Detailed Project Report (DPR) for a 56 km railway line connecting Amaravati, the capital of Andhra Pradesh, with a cost of ₹2,047 crore. The NITI Aayog has also approved the project. The line will include a large bridge over the Krishna River. Construction work on...
more...
the Guntur-Bibinagar second line, costing ₹2,853 crore, will begin next month. This line will be 48 km long. The construction of the Guntur-Guntakal line is almost complete, with only 100 km remaining out of the total 400 km. Construction of the Nadikudi-Srikalahasti line is progressing well, with 75 km out of the total 308 km completed. The Guntur railway division has allocated ₹300 crore for the development of 16 stations under the Amrit scheme. The division earned ₹671 crore last year and has earned ₹208.713 crore till July this year.

Andhra Pradesh ke capital Amaravati ko railway line se connect karne ke liye 56 kilometer lamba railway line ka DPR (Detailed Project Report) Railway Board ne approve kar diya hai. Is project ki cost ₹2,047 crore hai aur NITI Aayog ne bhi isko approve kar diya hai. Is line mein Krishna...
more...
River par ek bada bridge bhi banega. Guntur-Bibinagar second line ke construction ka kaam ₹2,853 crore ki cost se agle mahine shuru hone wala hai. Yeh line 48 kilometer lambi hogi. Guntur-Guntakal line ka construction almost complete ho chuka hai, sirf 400 kilometer mein se 100 kilometer baki hain. Nadikudi-Srikalahasti line ka construction aage badh raha hai, 308 kilometer mein se 75 kilometer ka kaam complete ho chuka hai. Guntur railway division ne Amrit scheme ke under 16 stations ke development ke liye ₹300 crore allocate kiye hain. Division ne last year ₹671 crore kamaya tha aur is saal July tak ₹208.713 crore kama liya hai.

Rail News
24674 views
0

Aug 16 (08:18)
NaagendraV
NaagendraV   386 blog posts
Re# 6158949-1              
Article source :

రాష్ట్ర రాజధాని అమరావతి రైలు మార్గం అనుసంధానం కోసం రూ.2,047 కోట్లతో 56 కిలోమీటర్ల రైల్వేలైన్‌కు సంబంధించిన డీపీఆర్‌ (సవివర ప్రాజెక్టు నివేదిక)కు రైల్వేబోర్డు అమోదం తెలిపిన తర్వాత నీతి ఆయోగ్‌ ఆమోదముద్ర వేసిందని మండల రైల్వే అధికారి(డీఆర్‌ఎం) రామకృష్ణ తెలిపారు.

గుంటూరు మండల
...
more...
రైల్వే అధికారి రామకృష్ణ వెల్లడి



గుంటూరు రైల్వే, న్యూస్‌టుడే: రాష్ట్ర రాజధాని అమరావతి రైలు మార్గం అనుసంధానం కోసం రూ.2,047 కోట్లతో 56 కిలోమీటర్ల రైల్వేలైన్‌కు సంబంధించిన డీపీఆర్‌ (సవివర ప్రాజెక్టు నివేదిక)కు రైల్వేబోర్డు అమోదం తెలిపిన తర్వాత నీతి ఆయోగ్‌ ఆమోదముద్ర వేసిందని మండల రైల్వే అధికారి(డీఆర్‌ఎం) రామకృష్ణ తెలిపారు. గుంటూరులోని రైల్‌విహార్‌ క్రీడా మైదానంలో 78వ స్వాతంత్య్ర దిన వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ముందుగా జాతీయ జెండాను ఎగురవేసి రైల్వే రక్షక దళం నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం రామకృష్ణ మాట్లాడారు. ఈ మార్గంలో కృష్ణానదిపై ఒక భారీ వంతెన కూడా నిర్మిస్తున్నామన్నారు. గుంటూరు-బీబీనగర్‌ రెండో లైను నిర్మాణానికి రూ.2,853 కోట్లు మంజూరయ్యాయన్నారు. ఇందులో 48 కి.మీ మార్గం నిర్మాణం పనులు వచ్చే నెలలో ప్రారంభమవుతాయన్నారు. గుంటూరు-గుంతకల్‌ మార్గంలో మొత్తం 400 కి.మీ నిర్మాణంలో ఇంకా 100 కి.మీ మాత్రమే మిగిలిందన్నారు. నడికుడి-శ్రీకాళహస్తి మార్గంలో మొత్తం 308 కి.మీకి ఇప్పటివరకు 75 కి.మీ పూర్తయిందన్నారు. అమృత్‌ పథకం కింద 16 స్టేషన్ల అభివృద్ధికి రూ.300 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. గత ఏడాది డివిజన్‌ రూ.671 కోట్ల ఆదాయం ఆర్జించగా, ఈ ఏడాది జులై వరకు రూ.208.713 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు.   

#APRailwayinfra
#APnewRailwayline
#APNRL
#SCOR
#BZA #GNT

Translate to English
Translate to Hindi
Rail News
35315 views
1

Jul 25 (08:11)   Railway Ministry Approves New Line Construction in Andhra Pradesh, Allocates Funds for Infrastructure Development

NaagendraV   46 news posts
Entry# 6135606   News Entry# 561995         Tags   Past Edits
Vijayawada Railway: అమరావతి రైల్వే లైను ప్రాజెక్టుకు రైల్వేబోర్డు, నీతిఆయోగ్‌ ఆమోదం: డీఆర్‌ఎం

The Indian Railway Ministry has approved a final location survey for the construction of a new railway line between Machilipatnam and Narsapur, falling under the Vijayawada Railway Division. The 2024-25 railway budget allocated ₹9,151 crores to Andhra Pradesh, prioritizing infrastructure development. Several railway projects totaling ₹74,000 crores are underway in the...
more...
state, connecting Telangana, Odisha, and other states. A new railway line between Kotipalli and Narsapur, a long-awaited project for the Konaseema region, is set to be constructed at a cost of ₹2,120 crores. The budget allocated ₹300 crores for this project. Other allocations include ₹500 crores for the Vijayawada-Guntur third line project and ₹310 crores for the Kazipet-Vijayawada third line. The Ministry has also approved the construction of three to four tracks between Nidavalolu and Duvvada in the Vijayawada division, accelerating the implementation of these projects. Additionally, automatic signaling systems are being installed between Vijayawada and Duvvada, and the construction of tracks and automatic signaling systems between Guduru and Vijayawada is being expedited. A comprehensive project report for a new railway line connecting Amaravati, the capital region, has been approved by the Railway Board and NITI Aayog. The construction of this new line, including a new railway station in Amaravati, is expected to start soon. A 56 km railway line from Erupalem to Namburu will be constructed at a cost of ₹2,047 crores. A total of 73 railway stations in Andhra Pradesh, including 23 in the Vijayawada division, are being upgraded as Amrit Bharat stations, receiving a total allocation of ₹600 crores. The Rail Land Development Authority (RLDA) has submitted a proposal to the Railway Board for the comprehensive development of Vijayawada Railway Station, estimated at ₹820 crores. Intercity trains that were suspended in the Vijayawada division will resume operations from August 10th. The Railway Ministry has also directed the authorities to consider introducing special trains, taking into account the high demand and waiting lists for ‘Train on Demand’ services.

Vijayawada Railway Division ke andar Machilipatnam aur Narsapur ke beech railway line banane ke liye final location survey ke liye Central Government ne green signal de diya hai. 2024-25 railway budget me Andhra Pradesh ke liye ₹9,151 crore allocate kiya gaya hai, aur infrastructure development ko priority diya gaya hai. ...
more...
Telangana, Odisha, aur aur bhi kai states ko connect karte hue, state me ₹74,000 crore ke railway project different stages me chal rahe hain. Konaseema region ke logon ka saal bhar se wait tha Kotipalli aur Narsapur ke beech new railway line ke liye, aur ab iske liye ₹2,120 crore ka budget aaya hai, aur is project ke liye ₹300 crore allocate kiye gaye hain. Vijayawada-Guntur third line project ke liye ₹500 crore aur Kazipet-Vijayawada third line ke liye ₹310 crore allocate kiye gaye hain. Vijayawada division me Nidavalolu aur Duvvada ke beech teen se chaar tracks banane ke liye ministry ne approve de diya hai, aur is project ko jaldi pura karne ki planning chal rahi hai. Vijayawada aur Duvvada ke beech automatic signaling system install kiya ja raha hai, aur Guduru aur Vijayawada ke beech track aur automatic signaling system ke construction ka kaam tez kiya ja raha hai. Capital region Amaravati ko connect karne wali new railway line ke liye ek comprehensive project report ko Railway Board aur NITI Aayog ne approve kar diya hai. Is new line ka construction, jisme Amaravati me ek new railway station bhi hoga, jaldi shuru hone wala hai. Erupalem se Namburu tak 56 km railway line banayi jaayegi, jiska cost ₹2,047 crore hoga. Andhra Pradesh me 73 railway stations ko Amrit Bharat stations banaya ja raha hai, jisme se 23 Vijayawada division me hain, aur iske liye total ₹600 crore allocate kiye gaye hain. Vijayawada Railway Station ke comprehensive development ke liye Rail Land Development Authority (RLDA) ne Railway Board ko ₹820 crore ka proposal bheja hai. Vijayawada division me suspend kiye gaye intercity trains August 10th se chalna shuru kar denge. Railway Ministry ne authorities ko ‘Train on Demand’ service ke liye high demand aur waiting list ko dekhte hue special trains introduce karne ka order diya hai.

Rail News
35959 views
0

Jul 25 (08:11)
NaagendraV
NaagendraV   386 blog posts
Re# 6135606-1              
విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలో మచిలీపట్నం-నర్సాపూర్‌ మధ్య రైల్వే లైన్‌ నిర్మాణం కోసం ఫైనల్‌ లొకేషన్‌ సర్వేకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపిందని విజయవాడ రైల్వే డీఆర్‌ఎం నరేంద్ర ఎ.పాటిల్‌ తెలిపారు.



విజయవాడ:
...
more...
విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలో మచిలీపట్నం-నర్సాపూర్‌ మధ్య రైల్వే లైన్‌ నిర్మాణం కోసం ఫైనల్‌ లొకేషన్‌ సర్వేకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపిందని విజయవాడ రైల్వే డీఆర్‌ఎం నరేంద్ర ఎ.పాటిల్‌ తెలిపారు. 2024-25 రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి రూ.9,151 కోట్లు కేటాయించిందని, ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇచ్చిందని చెప్పారు. రైల్వే బడ్జెట్‌పై ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఏపీ మీదుగా తెలంగాణ, ఒడిశా తదితర రాష్ట్రాలను కలుపుతూ సుమారు రూ.74వేల కోట్ల రైల్వే ప్రాజెక్టు పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయన్నారు. 

‘‘కోనసీమ వాసుల కలగా ఉన్న కోటిపల్లి-నర్సాపూర్‌ మధ్య రూ.2,120 కోట్ల వ్యయంతో నిర్మించనున్న కొత్త రైల్వే లైన్‌ కోసం ఈ ఏడాది రూ.300 కోట్లు కేటాయించారు. విజయవాడ-గూడురు మూడో లైన్‌ ప్రాజెక్టు కోసం రూ.500 కోట్లు, కాజీపేట-విజయవాడ మధ్య మూడో లైన్‌ కోసం రూ.310కోట్లు ఇచ్చారు. విజయవాడ డివిజన్‌లో నిడదవోలు, దువ్వాడ మధ్య మూడు, నాలుగు లైన్ల నిర్మాణానికి ఆమోదం లభించింది. దీంతో పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. విజయవాడ-దువ్వాడ మధ్య ఆటోమెటిక్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థ నెలకొల్పుతున్నాం. గూడురు-విజయవాడలో ఆటోమెటిక్‌ సిగ్నలింగ్‌తోపాటు ట్రాక్‌ నిర్మాణ పనులు వేగవంతం చేస్తాం. 

అమరావతి రాజధాని ప్రాంతానికి అనుసంధానంగా కొత్త రైల్వే లైను కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదికకు రైల్వే బోర్డు, నీతిఆయోగ్‌ నుంచి ఆమోదం లభించింది. ఈ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయి. అమరావతిలో కొత్త రైల్వే స్టేషన్‌ నిర్మాణం కానుంది. ఏరుపాలెం నుంచి నంబూరు వరకు మొత్తం రూ.2,047 కోట్ల వ్యయంతో 56 కి.మీ రైల్వే లైన్‌ ఏర్పాటు చేయనున్నాం. రాష్ట్రంలో 73 రైల్వే స్టేషన్లను అమృత్‌ భారత్‌ స్టేషన్లుగా తీర్చిదిద్దుతున్నారు.. అందులో విజయవాడ డివిజన్‌ పరిధిలో 23 స్టేషన్లు ఉన్నాయి. వీటి కోసం రూ.600 కోట్ల వరకు నిధులు మంజూరు కానున్నాయి. విజయవాడ రైల్వే స్టేషన్‌ సమగ్రాభివృద్ధి కోసం రైల్‌ ల్యాండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(ఆర్‌ఎల్‌డీఏ) సుమారు రూ. 820 కోట్ల అంచనాతో ప్రతిపాదనలను రైల్వే బోర్డుకు పంపింది. 

విజయవాడ డివిజన్‌ పరిధిలో రద్దు చేసిన రైళ్లలో ఇంటర్‌సిటీ వంటివి ఆగస్టు 10 నుంచి పునరుద్ధరిస్తాం. రద్దీ ఎక్కువగా ఉంటూ వెయింటింగ్‌ లిస్టు అధికంగా ఉండే ‘ట్రెయిన్‌ ఆన్‌ డిమాండ్‌’ను పరిగణనలోకి తీసుకొని ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి తీసుకొచ్చేలా తగిన నిర్ణయాలు తీసుకోవాలని రైల్వేశాఖ ఆదేశించింది’’అని డీఆర్‌ఎం నరేంద్ర వివరించారు.

#SCOR #APRAILWAYINFRA #BZA #GNT #GTL #VSKP
#RAILWAYZONE #APNRL #apNewRailwayLine

Translate to English
Translate to Hindi
Rail News
39154 views
0

Jul 25 (07:57)   Indian Railways Allocates ₹9,151 Crore for Andhra Pradesh, Includes Amaravati Rail Line Project

NaagendraV   46 news posts
Entry# 6135587   News Entry# 561986         Tags   Past Edits
Amaravati railway line: రూ.2 వేల కోట్లతో అమరావతి రైల్వేలైన్‌ అభివృద్ధి

The Indian Railway Minister, Ashwini Vaishnaw, announced an allocation of ₹9,151 crore for Andhra Pradesh in the railway budget. This includes a ₹2,047 crore project to construct a 56 km railway line connecting Amaravati, the state capital, with a bridge over the Krishna River. The Minister also mentioned that the...
more...
Vijayawada railway station is being modernized to accommodate the needs of the next 50 years, considering the upcoming development of Amaravati. Vaishnaw stated that the government is working to expedite railway projects in the state, including the development of a new railway zone with headquarters in Visakhapatnam. The construction of the Visakhapatnam zone is pending due to a change in location requested by the state government, and the minister expects the new location to be finalized soon. In terms of new train services, the minister confirmed that a Vande Bharat Express between Bengaluru and Vijayawada is being considered.

Railway Minister Ashwini Vaishnaw ne Andhra Pradesh ke liye railway budget mein ₹9,151 crore allocate kiya hai. Ismein Amaravati, state capital, ko connect karne wala 56 km railway line ka ₹2,047 crore ka project bhi include hai, jisme Krishna River par ek bridge bhi banega. Minister ne yeh bhi bataya ki...
more...
Vijayawada railway station ko next 50 saal ke liye modernize kiya ja raha hai, Amaravati ke development ko dhyan mein rakhte hue. Vaishnaw ne yeh bhi kaha ki government state mein railway projects ko jaldi se jaldi complete karne ke liye kaam kar rahi hai, jisme Visakhapatnam mein headquarters ke saath ek new railway zone ka development bhi include hai. Visakhapatnam zone ka construction state government ki taraf se location change karne ki wajah se ruk gaya hai, aur minister ko umeed hai ki yeh location jaldi decide ho jaayega. New train services ke baare mein, minister ne confirm kiya ki Bengaluru aur Vijayawada ke beech ek Vande Bharat Express start karne ka plan banaya ja raha hai.

Rail News
40627 views
0

Jul 25 (07:59)
NaagendraV
NaagendraV   386 blog posts
Re# 6135587-1              
రైల్వే బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ఈ ఏడాది రూ.9,151 కోట్లు కేటాయించామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ప్రకటించారు.

రైల్వే బడ్జెట్‌లో ఏపీకి రూ.9,151 కోట్లుకృష్ణా నదిపై భారీ వంతెన డీపీఆర్‌కు రైల్వే బోర్డు, నీతిఆయోగ్‌ ఆమోదముద్ర 50 ఏళ్లను దృష్టిలో ఉంచుకొని విజయవాడ స్టేషన్‌ ఆధునికీకరణ లోక్‌సభలో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడి 

...
more...


లోక్‌సభలో మాట్లాడుతున్న అశ్వినీవైష్ణవ్‌

ఈనాడు, దిల్లీ: రైల్వే బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ఈ ఏడాది రూ.9,151 కోట్లు కేటాయించామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ప్రకటించారు. రాష్ట్ర రాజధాని అమరావతికి రైలు మార్గం అనుసంధానం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.2,047 కోట్లతో 56 కిలోమీటర్ల రైల్వేలైన్‌ను అభివృద్ధి చేయబోతోందని చెప్పారు. ఈ మార్గంలో కృష్ణా నదిపై ఒక భారీ వంతెన కూడా నిర్మిస్తున్నందున ప్రాజెక్టు వ్యయం ఇంత పెద్ద స్థాయిలో ఉందని చెప్పారు.  

బుధవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో పెండింగ్‌లో ఉన్న రైల్వే లైన్ల పూర్తి, విజయవాడ రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణ గురించి తెదేపా ఎంపీ కేశినేని శివనాథ్‌ అడిగిన ప్రశ్నలకు, ఆ తర్వాత రైల్‌భవన్‌లో జరిగిన సమావేశంలో విలేకర్ల ప్రశ్నలకు కేంద్ర మంత్రి బదులిచ్చారు. 



‘ఆంధ్రప్రదేశ్‌ చాలా ముఖ్యమైన రాష్ట్రం. గత పదేళ్లలో రాష్ట్రానికి గతంలో ఎన్నడూ లేనన్ని నిధులు కేటాయించాం. 2009-14 మధ్య ఉమ్మడి రాష్ట్రానికి ఏటా సగటున రూ.886 కోట్లు కేటాయిస్తే, మోదీ ప్రభుత్వంలో విభజిత ఆంధ్రప్రదేశ్‌కు ఈ ఏడాది ఒక్కటే రూ.9,151 కోట్లు కేటాయించాం. యూపీఏ హయాంలో ఏటా సగటున 72 కి.మీ. రైల్లే లైన్ల నిర్మాణం జరిగితే, మోదీ ప్రభుత్వం వచ్చాక అది 150 కి.మీ.కి పెరిగింది. రాష్ట్రంలో రైల్వేలైన్ల విద్యుదీకరణ 100% పూర్తయింది. ప్రస్తుతం ఏపీలో రూ.73,743 కోట్ల విలువైన ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. అమృత్‌ పథకం కింద 73 స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నాం. గత పదేళ్లలో 743 ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించాం. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో రూ.26,292 కోట్ల విలువైన 1,935 కి.మీ. 17 కొత్తలైన్ల నిర్మాణం కొనసాగుతోంది’ అని అశ్వినీ వైష్ణవ్‌ వివరించారు. అమరావతి రైల్వే లైనుకు సంబంధించిన డీపీఆర్‌కు రైల్వే బోర్డు ఆమోదం తెలిపిన తర్వాత ఇటీవల నీతిఆయోగ్‌ ఆమోదముద్ర వేసిందన్నారు. తదుపరి దశ అనుమతులకు కొంత సమయం పడుతుందని చెప్పారు. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు పురోగతి బాగుందన్నారు. ఈ లైన్‌ ఎర్రుపాలెం నుంచి ప్రారంభమై కృష్ణా నది మీదుగా అమరావతి స్టేషన్‌ నుంచి నంబూరు వరకు వెళ్తుందని మంత్రి వివరించారు. 

రైల్వేజోన్‌కు స్థలం ఇచ్చిన వెంటనే నిర్మాణం  

విశాఖపట్నం కేంద్రంగా తలపెట్టిన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ప్రధాన కార్యాలయం నిర్మాణం కోసం కొత్తగా వేరేచోట స్థలం చూపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ప్రకటించారు. ‘ఇదివరకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వజూపిన భూమి చెరువు ముంపు నీటిలో ఉండటంతో ప్రత్యామ్నాయంగా మరో చోట స్థలం కేటాయించాలని పాత ప్రభుత్వాన్ని నిరంతరం కోరుతూ వచ్చాం. ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు విశాఖలోని డీఆర్‌ఎం కార్యాలయానికి వెళ్లి ఎలాంటి స్థలం అనువుగా ఉంటుందన్నదానిపై చర్చించారు. దీనిపై రామ్మోహన్‌నాయుడితో నేను కూడా మాట్లాడాను. త్వరగా కొత్త స్థలం గుర్తించి, స్వాధీనం చేస్తే నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రికి కూడా చెప్పాం. త్వరలో అడుగులు పడతాయని ఆశిస్తున్నాం’ అని ఆయన వివరించారు. 

ప్రాజెక్టుల వేగం పెంచుతున్నాం

రైల్వే ప్రాజెక్టుల వ్యయాన్ని పంచుకొనే అంశం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉందని.. దీంతోపాటు భూసేకరణ సమస్య గురించీ తాను ముఖ్యమంత్రితో మాట్లాడానని అశ్వినీ వైష్ణవ్‌ చెప్పారు. ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రైల్వేపరంగా చాలా అభివృద్ధి పనులు చేపట్టబోతున్నామన్నారు. విజయవాడ రైల్వేస్టేషన్‌ విస్తరణ గురించి ఎంపీ కేశినేని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ‘ఆ ప్రాజెక్టు చాలా సంక్లిష్టమైంది. అమృత్‌ భారత్‌ స్టేషన్‌లో చేర్చిన దీని ఆధునికీకరణకు మాస్టర్‌ ప్లానింగ్‌ పూర్తయింది. దేశంలో అత్యధిక రద్దీ ఉండే స్టేషన్లలో ఒకటైన విజయవాడను వచ్చే 50 ఏళ్ల కాలాన్ని, సమీపంలో ఉన్న అమరావతిని దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి చేసేలా సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఇందుకు సంబంధించిన మాస్టర్‌ప్లాన్, ఇతర ప్రాజెక్టు వివరాలను ఎంపీకి అందజేస్తాం’ అని చెప్పారు.

బెంగళూరు- విజయవాడ వందేభారత్‌!

రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల జాప్యానికి కారణమేంటి? అనకాపల్లి స్టేషన్‌ను ఎప్పుడు అభివృద్ధి చేస్తారని ఎంపీ సీఎం రమేష్‌ ప్రశ్నించారు. అనకాపల్లి స్టేషన్‌ను అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకంలో చేర్చి, దాని అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్‌ రూపొందిస్తున్నట్లు మంత్రి జవాబిచ్చారు. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల ఆలస్యానికి చాలా కారణాలున్నాయని, అందులో భూసేకరణలో జాప్యం అత్యంత ప్రధానమైందని వెల్లడించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంతో సుహృద్భావ వాతావరణంలో పనిచేసి భూసేకరణ వేగవంతంగా జరిగేలా చూస్తామని వివరించారు. విజయవాడ, ముంబయి మధ్య దూరం ఎక్కువ కావడంతో ఆ రెండు స్టేషన్ల మధ్య వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. బెంగళూరు - విజయవాడ మధ్య ప్రారంభించే విషయాన్ని పరిశీలిస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తిరుపతి రైల్వేస్టేషన్‌లో అభివృద్ధి వేగంగా జరుగుతోందని, త్వరలోనే అందుబాటులోకి తెస్తామని మంత్రి ప్రకటించారు.
#SCOR #APRAILWAYINFRA #BZA #GNT #GTL #VSKP
#RAILWAYZONE #APNRL #apNewRailwayLine

Translate to English
Translate to Hindi
Rail News
44115 views
1

Jun 22 (09:45)   Amaravati Railway Project: A Crucial Project Finally Gets a Push, But With a Catch

NaagendraV   46 news posts
Entry# 6102773   News Entry# 557197         Tags   Past Edits
Amravati: మూడు మార్గాలూ డబుల్‌ లైన్లతోనే అమరావతికి న్యాయం

The Indian Railways are finally taking steps to build a crucial railway project for Amaravati, the new capital of Andhra Pradesh. This project was initially approved in 2017-18, but progress was stalled for several years. The project involves three lines totaling 106 km, but the current plan is only for a...
more...
single line, 56 km long, which has led to criticism. The current plan is to build a single line connecting Errupalem to Amaravati to Namburu, while the original plan included double lines for all three routes. The construction of these lines will reduce congestion at Vijayawada and Guntur railway stations. The single line, if built, will cost approximately INR 2,600 crore. The original cost of the entire project with three lines was estimated to be INR 3,272 crore. The delay in the project has led to a significant increase in the cost. The project is expected to reduce travel time for commuters travelling to the capital. The current plan is facing criticism due to its limited scope and the potential for future problems. The original proposal was for double lines to accommodate future growth and avoid future land acquisition challenges.

Andhra Pradesh ki nayi capital Amaravati ke liye ek bahut important railway project ko Indian Railways aakhirkar shuru karne ja rahe hain. Yeh project 2017-18 me approved hua tha, parantu kai saal tak ruk gaya. Project me 106 km ki 3 lines banani thi, parantu abhi sirf 56 km ki...
more...
ek single line banane ki plan hai, jisse bahut criticism ho rahi hai. Current plan me Errupalem se Amaravati tak Namburu tak ek single line banayi ja rahi hai, jabki original plan me sabhi 3 routes pe double line thi. In lines ki construction se Vijayawada aur Guntur railway stations par kam congestion hoga. Single line ki cost INR 2,600 crore aane ki estimate hai. Original project ki cost three lines ke saath INR 3,272 crore thi. Project me aane wali delay ke wajah se cost bahut badh gayi hai. Project se capital jaane waale commuters ka travel time kam hoga. Current plan ko limited scope aur future me problem hone ki wajah se criticism ka samna karna pad raha hai. Original proposal double lines ka tha, taki future growth ko dekhte hue land acquisition ki problems se bacha ja sake.

Rail News
42341 views
0

Jun 22 (21:20)
NaagendraV
NaagendraV   386 blog posts
Re# 6102773-1               Past Edits
Article source :

రాజధాని అమరావతి ప్రాంతానికి ఎంతో కీలకమైన రైల్వే ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టడంతోనే రైల్వేశాఖ ఇంతకాలం మరిచిపోయిన ప్రాజెక్టును బయటకు తీసింది. రైల్వే చట్టం కింద భూసేకరణకు తాజాగా నోటిఫికేషన్‌ ఇచ్చింది.
56 కి.మీ. సింగిల్‌ లైన్‌తో ఒరిగేదేంటి?ఏడేళ్ల కిందటే 106 కి.మీ.లకు డీపీఆర్‌ సిద్ధంమొత్తం ప్రాజెక్టుకు ఇప్పుడే భూసేకరణ చేయాలిసీఎం చంద్రబాబు జోక్యంతోనే..
...
more...
ఇదంతా సాధ్యంఈనాడు, అమరావతి
రాజధాని అమరావతి ప్రాంతానికి ఎంతో కీలకమైన రైల్వే ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టడంతోనే రైల్వేశాఖ ఇంతకాలం మరిచిపోయిన ప్రాజెక్టును బయటకు తీసింది. రైల్వే చట్టం కింద భూసేకరణకు తాజాగా నోటిఫికేషన్‌ ఇచ్చింది. దీంతో ఈ ప్రాజెక్టుకు మళ్లీ ఊపిరి వచ్చిందని అంతా భావిస్తున్నారు. అయితే అమరావతి రైల్వేప్రాజెక్టులో మూడు లైన్లకు బదులు ఒక్కటే నిర్మించేందుకు రైల్వేశాఖ సమాయత్తం అవుతుండటం, అదీ ఒక వరుసతో సరిపెట్టేందుకు చూస్తుండడంపై విమర్శలు వస్తున్నాయి. అన్ని ప్రాంతాలను అమరావతితో అనుసంధానం చేస్తూ, నేరుగా రాజధాని ప్రాంతానికి చేరుకునేలా ఏడేళ్ల కిందట రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను రైల్వేశాఖ విస్మరించడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మూడు లైన్లు కలిపి 106 కి.మీ.లను డబుల్‌ లైన్‌తో నిర్మిస్తేనే.. రాజధానికి న్యాయం జరుగుతుంది. అమరావతి పనులు ఊపందుకోవడంతో భూముల ధరలు పెరుగుతున్నాయి. అందువల్ల మొత్తం ప్రాజెక్టుకు ఇప్పుడే భూసేకరణ చేపడితేనే భవిష్యత్తులో ఇబ్బందులు ఉండవు. 106 కి.మీ. అమరావతి సమగ్ర రైల్వే ప్రాజెక్టు విషయంలో సీఎం చంద్రబాబు జోక్యం చేసుకొని, రైల్వే ఉన్నతాధికారులు, కేంద్రంతో మాట్లాడితే.. ఇదంతా సాధ్యమవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


ప్రాజెక్టు అసలు స్వరూపమిది..

అమరావతి రైల్వే ప్రాజెక్టు తొలుత 2017-18లో మంజూరైంది.
ఇప్పుడేం చేస్తున్నారు?
ఈ ప్రాజెక్టు మొత్తం చేపడితే వ్యయం ఎక్కువవుతోందంటూ.. ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు లైన్‌నే ప్రస్తుతం నిర్మించేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. డీపీఆర్‌లో ఇది డబుల్‌ లైన్‌ ఉండగా, సింగిల్‌ లైన్‌కే పరిమితం అవుతున్నారు. 
పూర్తి ప్రయోజనాలు పట్టించుకోకుండా..

రాజధాని నిర్మాణం ఊపందుకుంటోంది. మున్ముందు ఇక్కడకు రాకపోకలు సాగించేవారి సంఖ్య భారీగా పెరగనుంది. ఉద్యోగులు, వ్యాపారులు, పనులపై సచివాలయానికి, ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలు, హైకోర్టుకు వస్తారు. వీరంతా రైలుమార్గంలో రావాలంటే విజయవాడ గానీ, గుంటూరు గానీ వచ్చి.. అక్కడినుంచి రోడ్డుమార్గంలో రాజధానికి వస్తున్నారు. నేరుగా అమరావతికి రావాలంటే కొత్త రైల్వేప్రాజెక్టు ఉపకరిస్తుంది. ఇప్పటికే విజయవాడ జంక్షన్‌ స్టేషన్‌కు నిత్యం సగటున 250 రైళ్ల రాకపోకలు ఉండటంతో.. ఈ స్టేషన్‌పై ఎంతో ఒత్తిడి ఉంటోంది. అటు గుంటూరు స్టేషన్‌కూ నిత్యం 50 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ రెండు స్టేషన్లపై ఒత్తిడి తగ్గించేందుకు అమరావతి రైల్వే ప్రాజెక్టు ప్రత్యామ్నాయ మార్గంగా ఉపయోగపడుతుంది.

106 కి.మీ. డబుల్‌ లైన్‌ నిర్మిస్తేనే..

రాజధానికి కొత్తగా రైలుమార్గం వేసిన తర్వాత రైళ్ల రాకపోకలు పెరిగి.. అమరావతికి రద్దీ పెరుగుతుంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాజెక్టులో మూడు మార్గాలను డబుల్‌ లైన్లతో నిర్మించాలి. రాజధాని అమరావతి ప్రాంతంలో భూముల ధరలు పెరుగుతున్నందున.. ఇప్పుడు సింగిల్‌లైన్‌కే భూసేకరణ చేస్తే.. భవిష్యత్తులో విస్తరించాలంటే భూసేకరణ తడిసిమోపెడు అవుతుంది. ధరలు పెరిగాక, స్థలాలు ఇచ్చేందుకు రైతులు, ప్రజలు ముందుకురారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడే 106 కి.మీ. మూడు మార్గాలను డబుల్‌ లైన్ల నిర్మాణం కోసం భూసేకరణ చేపట్టి, రెండేళ్లలో ఈ ప్రక్రియ పూర్తిచేయాలనే వాదన వినిపిస్తోంది.
అప్పట్లోనే మొదలైతే.. రూ.3,272 కోట్లు సరిపోయేవి

మొదట్లో ఈ మూడు లైన్లకు భూసేకరణ, నిర్మాణ వ్యయం కలిపి రూ.3,272 కోట్లు అవుతుందని అంచనా వేశారు. 2017-18లో డీపీఆర్‌ సిద్ధమైన తర్వాత రైల్వేశాఖ, కేంద్ర ఆర్థికశాఖ దీనికి అనుమతులిచ్చి, పనులు ఆరంభిస్తే.. అదే సొమ్ముతో ప్రాజెక్టు పూర్తయ్యేది. కానీ ఏడేళ్లుగా పట్టించుకోకపోవడంతో.. ఇప్పుడీ ప్రాజెక్టు వ్యయం భారీగా పెరిగింది. ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు సింగిల్‌లైన్‌కే భూసేకరణతో కలిపి రూ.2,600 కోట్లు అవుతుందని కొత్తగా అంచనా వేశారు.

మూడు లైన్లతో మేలు జరిగేదిలా..

1 ఎర్రుపాలెం-నంబూరు లైన్‌తో.. ప్రధాన లైన్లకు అనుసంధానం
విజయవాడ-కాజీపేట మార్గంలోని ఎర్రుపాలెం వద్ద మొదలయ్యే ఈ లైన్‌ రాజధాని అమరావతి మీదుగా వెళ్లి గుంటూరు-విజయవాడ మార్గంలోని నంబూరు వద్ద కలుస్తుంది. దీంతో ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు కొత్త లైన్‌కు.. అటు కాజీపేట వైపు, ఇటు గుంటూరు వైపు ఉన్న ప్రధాన లైన్లతో అనుసంధానం ఏర్పడుతుంది. ప్రస్తుతం దిల్లీ, ఉత్తరాది రాష్ట్రాల నుంచి తమిళనాడు, కేరళ వైపు వెళ్లే రైళ్లన్నీ కాజీపేట మీదుగా విజయవాడ వచ్చి, అక్కడి నుంచి తెనాలి మీదుగా చెన్నై వైపు వెళ్తున్నాయి. ఎర్రుపాలెం-నంబూరు లైన్‌ అందుబాటులోకి వస్తే.. ఆయా రైళ్లు విజయవాడకు రావాల్సిన అవసరం లేకుండా ఎర్రుపాలెం వద్ద కొత్తలైన్‌లోకి ప్రవేశించి అమరావతి మీదుగా నంబూరు వచ్చి, అక్కడి నుంచి న్యూగుంటూరు మీదుగా తెనాలి వెళ్లి.. చెన్నైవైపు వెళ్లే ప్రధాన రైలుమార్గంలో కలవచ్చు. దీనివల్ల విజయవాడ స్టేషన్‌పై ఒత్తిడి తగ్గుతుంది. అలాగే కాజీపేట-విజయవాడ-తెనాలి మార్గానికి ప్రత్యామ్నాయంగా కూడా ఉంటుంది.

2 అమరావతికి దగ్గరి మార్గం.

సికింద్రాబాద్‌ నుంచి బీబీనగర్‌ మీదుగా గుంటూరుకు ఉన్న రైలు మార్గంలో.. పెదకూరపాడు-అమరావతి కొత్త లింక్‌ లైన్‌ను అనుసంధానం చేస్తే రాజధానికి దగ్గరి దారి అవుతుంది. ప్రస్తుతం సికింద్రాబాద్‌ నుంచి బీబీనగర్‌ మీదుగా సత్తెనపల్లి, పెదకూరపాడు, నల్లపాడు మీదుగా గుంటూరుకు రైళ్లు వెళ్తున్నాయి. దీనివల్ల ప్రయాణికులు గుంటూరులో దిగి, రోడ్డు మార్గాన రాజధానికి చేరుకోవాల్సి వస్తోంది. అదే పెదకూరపాడు-అమరావతి లైన్‌ నిర్మాణం జరిగితే.. సికింద్రాబాద్‌ నుంచి వచ్చే రైళ్లు సత్తెనపల్లి తర్వాత పెదకూరపాడు వద్ద కొత్తలైన్‌ ద్వారా నేరుగా అమరావతికి చేరుకోవచ్చు.

3 సీమ నుంచి నేరుగా రాజధానికి..

రాయలసీమలో గుంతకల్లు వైపు నుంచి వచ్చే రైళ్లు ప్రస్తుతం నరసరావుపేట, నల్లపాడు మీదుగా గుంటూరుకు చేరుకుంటున్నాయి. ఈ మార్గంలో వచ్చేరైళ్లు నేరుగా అమరావతికి చేరుకునేందుకు నరసరావుపేట-సత్తెనపల్లి కొత్త లింక్‌ లైను దోహదపడుతుంది. గుంతకల్లు వైపు నుంచి వచ్చే రైళ్లు గుంటూరు వెళ్లకుండా నరసరావుపేట నుంచి కొత్త లింక్‌ లైన్‌లో సత్తెనపల్లికి చేరుకుంటాయి. అక్కడి నుంచి బీబీనగర్‌-గుంటూరు పాతలైన్‌లోని సత్తెనపల్లి నుంచి పెదకూరపాడు వరకు వెళ్లి, ఆ తర్వాత పెదకూరపాడు నుంచి నేరుగా అమరావతికి చేరుకోవచ్చు.

#SCOR #APRAILWAYINFRA #BZA #GNT #GTL #VSKP
#RAILWAYZONE #APNRL #apNewRailwayLine

Translate to English
Translate to Hindi
Page#    9 Blog Entries  next>>

Scroll to Top
Scroll to Bottom
Go to Desktop site
Important Note: This website NEVER solicits for Money or Donations. Please beware of anyone requesting/demanding money on behalf of IRI. Thanks.
Disclaimer: This website has NO affiliation with the Government-run site of Indian Railways. This site does NOT claim 100% accuracy of fast-changing Rail Information. YOU are responsible for independently confirming the validity of information through other sources.
India Rail Info Privacy Policy